రోడ్డెక్కిన గొర్రెల కాపరులు..కవేలి కూడలిలో భారీ ధర్నా

తెలంగాణలో గొర్రెల కాపరులు రోడ్డెక్కారు. గొర్రెలతో సహా రోడ్లపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. గొర్రెల కాపరుల రోడ్డు దిగ్బంధంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

రోడ్డెక్కిన గొర్రెల కాపరులు..కవేలి కూడలిలో భారీ ధర్నా
Jyothi Gadda

|

Oct 06, 2020 | 1:40 PM

తెలంగాణలో గొర్రెల కాపరులు రోడ్డెక్కారు. గొర్రెలతో సహా రోడ్లపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. గొర్రెల కాపరుల రోడ్డు దిగ్బంధంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కిలో మీటర్ల మేర రహదారిపై వాహనాలు నిలిచిపోవటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధర్నా వద్దకు చేరుకున్న కోహీర్ పోలీసులు రాస్తారోకో విరమింపజేసి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు పరిశీలించగా..

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కవేలి కూడలిలో యాదవ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ గొర్రెలతో సహా రోడ్లపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. డీడీలు కట్టించుకుని గొర్రెలు పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి డీడీలు కడితే ఇప్పటి వరకు గొర్రెలు పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో విడత పంపిణీ కోసం డీడీలు కట్టి ఏడాదికిపైగా పూర్తి కావొస్తున్నా అధికారులు పంపిణీలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

గొర్రెల మందతో హైదరాబాద్-ముంబయి 65వ నంబరు జాతీయ రహదారిపై శాంతియుతంగా నిరసన చేపట్టారు. సీఎం కేసీఆర్ స్పందించి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నాయకులు కోరారు. యాదవ సంఘం నాయకులు రాస్తారోకో హైదరాబాద్ ముంబై మార్గంలో వాహన రాకపోకలు స్తంభించాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu