ఇదే మన అభివ‌ృద్ధి మంత్రం-మంత్రి కేటీఆర్

తెలంగాణలో బంగారం లాంటి సారవంతమైన భూములు ఇన్నాయని.. చెరువుల కింద రెండు పంటలు పండించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఇదంతా కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైందని అన్నారు....

ఇదే మన అభివ‌ృద్ధి మంత్రం-మంత్రి కేటీఆర్
Follow us

|

Updated on: Jun 10, 2020 | 3:35 PM

దేశానికే ధాన్య నగరిగా తెలంగాణ మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం బందనకల్‌లో మంత్రి పర్యటించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బందనకల్ గ్రామానికి గోదావరి జలాలు చేరడంతో ఊర చెరువుకు జలకల సంతరించుకుందన్నారు.  ఈ సందర్భంగా..  గంగమ్మకు ఆయన జలహారతి ఇచ్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ… ఎన్నడూ చూడని జలదృశ్యం ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. తెలంగాణలో బంగారం లాంటి సారవంతమైన భూములున్నాయని.. చెరువుల కింద రెండు పంటలు పండించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఇదంతా కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైందని అన్నారు.

అలాగే సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే రైతులు వేయాలన్నారు. అందరూ ఒకే పంట వేస్తే  నష్టపోతారని రైతులకు ఆయన సూచించారు. ఇప్పుడు సిరిసిల్లలో జరుగుతున్న అభివృద్ధి ఐఏఎస్ అధికారులకు శిక్షణ పాఠంగా మారిందన్నారు.