హైటెక్ యుగంలో.. ఎన్నాళ్లీ హృదయవిదారకాలు

విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం కొత్త వలసలో విషాద ఘటన చోటుచేసుకుంది. హైటెక్, డిజిటల్ యుగం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు.. ఇంకా పలు గ్రామాలకు కనీసం రోడ్డు వసతులు లేవని.. విశాఖ జిల్లాలో జరిగిన ఘటన చూస్తే తెలుస్తోంది. నిండు గర్భిణీని 15 కిలో మీటర్ల మోసుకెళ్లారు గ్రామస్థులు. సరైన రోడ్డు సదుపాయం లేక.. వాహనాలు రాక దుప్పటినే డోలెలా మార్చారు. అందులోనే గర్భిణీని మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మనం ఒకటి తలిస్తే.. దేవుడు మరోకటి […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:55 pm, Sun, 21 July 19
హైటెక్ యుగంలో.. ఎన్నాళ్లీ హృదయవిదారకాలు

విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం కొత్త వలసలో విషాద ఘటన చోటుచేసుకుంది. హైటెక్, డిజిటల్ యుగం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు.. ఇంకా పలు గ్రామాలకు కనీసం రోడ్డు వసతులు లేవని.. విశాఖ జిల్లాలో జరిగిన ఘటన చూస్తే తెలుస్తోంది.

నిండు గర్భిణీని 15 కిలో మీటర్ల మోసుకెళ్లారు గ్రామస్థులు. సరైన రోడ్డు సదుపాయం లేక.. వాహనాలు రాక దుప్పటినే డోలెలా మార్చారు. అందులోనే గర్భిణీని మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మనం ఒకటి తలిస్తే.. దేవుడు మరోకటి తలుస్తాడన్నట్లు.. సాధారణ కాన్పు అవుతుందని అంతా అనుకున్నారు. అయితే అనుకోకుండా బిడ్డ అడ్డం తిరిగాడు. దీంతో ఏం చేయాలో పాలుకోక ఊరంతా ఒక్కటై.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఊరికి రోడ్డు మార్గం లేకపోవడంతో.. కర్రకు దుప్పటి కట్టి అందులోనే గర్భిణీని మోసుకెళ్లారు. దారిమధ్యలో వర్షం పడినా ఆ బురదలోనే ముందుకు కదిలారు. అయితే ఈ ఘటన వాళ్లకు కొత్తేం కాదు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ. ఏజెన్సీలో సరైన వైద్య సదుపాయం అందక ఎందరో ప్రాణాలు వదిలిన ఘటనలున్నాయి. అభివృద్ధి బాటలో పయనిస్తున్నామంటూ నేతలు గొప్పలు చెబుతున్నా.. సరైన రోడ్లు లేక, వైద్యం అందక జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కొత్త వలసలో చోటుచేసుకుంది కూడా అలాంటి ఘటనే. మొత్తానికి టీవీ9 కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్.. తల్లి, బిడ్డలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆదేశించారు.