భవానీ కథ సుఖాంతం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

పలు ట్విస్ట్‌ల మధ్య భవానీ కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు భవానీ కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదని వెల్లడించారు. కన్న తల్లిదండ్రుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. భవానీ విషయంలో ఇరు కుటుంబాలు తమ అనుమానాలకు తమ దృష్టికి తీసుకొచ్చారని.. వారి అనుమానాలను నివృత్తి చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవాని కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించిందని వారు తెలిపారు. […]

భవానీ కథ సుఖాంతం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 09, 2019 | 3:09 PM

పలు ట్విస్ట్‌ల మధ్య భవానీ కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు భవానీ కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదని వెల్లడించారు. కన్న తల్లిదండ్రుల వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వారు చెప్పుకొచ్చారు. భవానీ విషయంలో ఇరు కుటుంబాలు తమ అనుమానాలకు తమ దృష్టికి తీసుకొచ్చారని.. వారి అనుమానాలను నివృత్తి చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవాని కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించిందని వారు తెలిపారు. దీనిపై ఇరు వర్గాలు ఒప్పుకున్నారని.. పెంపుడు తల్లిదండ్రుల దగ్గర కూడా కొన్ని రోజులు ఉంటానని భవానీ ఒప్పుకుందని స్పష్టం చేశారు. పెంచిన తల్లిదండ్రులు బాగా చూసుకున్నారని.. భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తమకు ఫిర్యాదు చేయొచ్చని భవానీకి సూచించినట్లు పోలీసులు తెలిపారు.

భవానీ వెళ్తున్నందుకు బాధగా ఉంది: పెంచిన తల్లి తమకు ఉన్నంతలో భవానీని బాగా చూసుకున్నామని.. కానీ ఇప్పుడు ఆమె కన్న తల్లి దగ్గరకు వెళ్తానంటుంటే చాలా బాధగా ఉందని ఆమెను పెంచిన తల్లి జయమ్మ చెప్పుకొచ్చింది. అయినా పది రోజులకు ఒకసారి తమ దగ్గరకు వస్తామని భవానీ చెప్పిందని ఆమె తెలిపింది. పాప రక్షణ కోసమే డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని కోరామని జయమ్మ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. మరోవైపు భవానీని బాగా చూసుకోవాలని కోరుతున్నామని పెంచిన తండ్రి జీవరత్నం భావోద్వేగానికి గురయ్యారు.

ఇద్దరు తల్లులు ముఖ్యమే తనకు ఇద్దరు తల్లులు ముఖ్యమేనని భవానీ తెలిపింది. ప్రస్తుతానికి కన్నతల్లి దగ్గరకు వెళ్తున్నానని.. పది రోజులు తరువాత పెంచిన తల్లి దగ్గరకు వెళ్తానని ఆమె చెప్పుకొచ్చింది. మరోవైపు పాప కనిపించడం సంతోషంగా ఉందని, భవానీని ఇన్ని రోజులు కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రులకు రుణపడి ఉన్నామని.. ఆమె కన్న తల్లిదండ్రులు వెళ్లడించారు.

అయితే 12 ఏళ్ల క్రితం తన సోదరుడితో కలిసి స్కూల్‌కు వెళ్లిన భవానీ కనిపించకుండా పోయింది. ఆమె కోసం తల్లి దండ్రులు ఎంతగానో వెతికారు. మరోవైపు తప్పిపోయిన భవానీ జయమ్మ అనే మహిళకు కనిపించగా.. తన ఇంటికి తీసుకెళ్లి అప్పటి నుంచి తానే పెంచుకుంది. ఇంటర్ వరకు భవానీని చదివించింది. అయితే ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఓ ఇంట్లో పనిమనిషిగా చేరిన భవానీ.. ఆ ఇంటి యజయాని మోహన్ వంశీ సహాయంతో ఎట్టకేలకు కన్నవారిని కలుసుకోగలిగింది.

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.