విజయవాడలో గ్యాంగ్‌వార్‌.. ఆరుగురు అరెస్ట్‌

విజయవాడలో మరో గ్యాంగ్‌వార్‌ కలకలం రేపింది. పుట్టినరోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరుగురిని అరెస్ట్ చేశారు.

విజయవాడలో గ్యాంగ్‌వార్‌.. ఆరుగురు అరెస్ట్‌
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2020 | 3:05 PM

విజయవాడలో మరో గ్యాంగ్‌వార్‌ కలకలం రేపింది. పుట్టినరోజు వేడుకల్లో రౌడీషీటర్లు కత్తులు దూసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరుగురిని అరెస్ట్ చేశారు. గాజువాక సమీపంలోని పెదగంట్యాడ మండలం సీతానగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. సీతానగరంలో మొల్లి మహేష్ అనే యువకుడు నిర్వహించిన బర్త్‌డే పార్టీలో రౌడీషీటర్ మొల్లి సంతోష్ పాల్గొన్నాడు. ఆ వేడుకలకు వడ్లపూడికి చెందిన గందవరపు తరుణ్‌ అనే మరో రౌడీ షీటర్ వెళ్లాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ మొదలు కాగా.. ఒకరిపై మరొకరు కత్తులతో దాడులకు దిగారు.

కాగా మొల్లి సంతోష్ అలియాస్ సోనాసంత్‌ సబ్బవరం మండల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ, భూ తగాదాలు సెంటిల్‌మెంట్లు చేయడం లాంటివి చేస్తుంటాడని అక్కడి వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతడిపై ఒక్క పోలీస్‌ స్టేషన్‌లోనే 12 కేసులు ఉన్నట్లు సీఐ పైడిపు నాయుడు పేర్కొన్నారు. ఇక గందవరపు తరుణ్ బీటెక్ చదవగా.. ఓ హత్య కేసులో ప్రధాన ముద్దాయి అని, సైబర్ నేరాలు చేయడంలోనూ దిట్ట అని సమాచారం. ప్రజాప్రతినిథులకు ఫేక్ కాల్స్ చేసిన విషయంలోనూ తరుణ్‌పై కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తాజా గ్యాంగ్‌వార్ నేపథ్యంలో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.