భద్రాద్రి జిల్లాలో మావోయిస్టు కొరియర్ అరెస్ట్

మావోయిస్టు కొరియ‌ర్‌ను భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని భ‌ద్రాచ‌లంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. నిందితుడి వ‌ద్ద నుంచి పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్‌పీ రాజేశ్ చంద్ర వివ‌రాల‌ను

  • Sanjay Kasula
  • Publish Date - 7:14 pm, Fri, 11 September 20
భద్రాద్రి జిల్లాలో మావోయిస్టు కొరియర్ అరెస్ట్

మావోయిస్టులపై తెలంగాణ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మావోయిస్టు కొరియ‌ర్‌ను భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని భ‌ద్రాచ‌లంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. నిందితుడి వ‌ద్ద నుంచి పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్‌పీ రాజేశ్ చంద్ర వివ‌రాల‌ను వెల్ల‌డించారు. స్థానిక ఎస్సై  మ‌హేశ్ త‌న సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండ‌గా ఓ వ్య‌క్తి అనుమానాస్ప‌ద‌స్థితిలో క‌నిపించాడు. అరా తీస్తే అసలు విషయం బయట పడింది.

అదుపులోకి తీసుకుని త‌నిఖీ చేయ‌గా బ్యాగులో పేలుడు ప‌దార్థాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని ఛత్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లా పుసుబాకకు చెందిన పద్దం కల్లుగా నిర్ధారించారు. సీపీఐ(ఎం) స్పెష‌ల్ జోన‌ల్ క‌మిటీ స‌భ్యుడు పాపారావుకు కొరియ‌ర్‌గా కల్లు ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. పాపారావు ఆదేశానుసారం క‌ల్లు 150 డిటోనేట‌ర్లు, రెండు లిక్విడ్ బూస్ట‌ర్లు సేక‌రించి న‌క్స‌ల్స్‌కు చేర‌వేసేందుకు వెళ్తుండ‌గా పోలీసులు ప‌ట్టుకున్న‌ట్లు వెల్లడించారు.