రుణం తీసుకునేందుకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కి‌ అనుమతి

ఏపీలోని కడప స్టీల్ ప్లాంట్‌ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఏపీఎండీసీ నుంచి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు రూ. 20 కోట్ల రూపాయల

రుణం తీసుకునేందుకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కి‌ అనుమతి
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2020 | 9:51 PM

Kadapa Steel Plant: ఏపీలోని కడప స్టీల్ ప్లాంట్‌ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఏపీఎండీసీ నుంచి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు రూ. 20 కోట్ల రూపాయల మేర రుణాన్ని తీసుకునేందుకు అనుమతి లభించింది. రెండూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలే కాబట్టి బ్యాంకు గ్యారెంటీ లేకుండానే రుణాన్ని తీసుకునేందుకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కి అనుమతి లభించింది.  కాగా కడప ఉక్కు కర్మాగారాన్ని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌గా మార్చిన జగన్ సర్కార్‌ దాన్ని అభివృద్ధి చేయబోతోంది

ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంలో కడప జిల్లా సున్నపు రాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,591.65 ఎకరాల్లో ఈ ఉక్కు కార్మాగారం నిర్మాణం కాబోతోంది. దీనికి సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతేడాది డిసెంబర్‌ 23న శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే సివిల్‌ పనులు శరవేగంగా జరుగుతుండగా, వచ్చే జనవరి నుంచి ప్రధాన ప్లాంటు పనులు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఏపీహెచ్‌ఎస్‌ఎల్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది.

Read More:

గంగూలీ సర్‌ ‘వంటలక్క’ను చూడాలి.. ‘ఐపీఎల్’‌ టైమింగ్‌ని మార్చండి ప్లీజ్

 ‘రావణ్’ పాత్రకు మొదటి ఛాయిస్ సైఫ్ కాదట.. ఆ టాప్ హీరోనట