పద్మారావు గౌడ్ ని అభినందించిన భట్టి

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పద్మా దేవెందర్ గౌడ్ ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీల కతీతంగా అందరం కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అందరూ మెచ్చేలా సభను నడుపుతారని ఆశిస్తున్నానన్నారు భట్టి. ఆ స్థానంలో ఉన్న మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మీరు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పేదప్రజల కోసం పనిచేశారని, మీ ప్రాంత […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:52 pm, Mon, 25 February 19
పద్మారావు గౌడ్ ని అభినందించిన భట్టి

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పద్మా దేవెందర్ గౌడ్ ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీల కతీతంగా అందరం కలిసి మిమ్మల్ని ఎన్నుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అందరూ మెచ్చేలా సభను నడుపుతారని ఆశిస్తున్నానన్నారు భట్టి. ఆ స్థానంలో ఉన్న మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మీరు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పేదప్రజల కోసం పనిచేశారని, మీ ప్రాంత ప్రజల కోసం మీరు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ సభ్యుల హక్కుల్ని కాపాడాలని కోరుతున్నానన్నారు భట్టి విక్రమార్క.