తెలుగు వార్తలు » ఆంధ్రప్రదేశ్ » విశాఖపట్నం » Page 539
తన మీద నమ్మకంతో మరోసారి మంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు విధ్యాశాఖా మంత్రి జగదీష్ రెడ్డి. తనపై ఉన్న నమ్మకం ఉంచినందుకు దాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి అన్నారు. బుధవారం యదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి జ�
ఎట్టకేలకు ఊహాగానాలకు తెరపడింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా కోడుమూరులో లక్షమందితో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కోట్ల, మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీక
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ అధికారి ఏసీబీ వలలో అడ్డంగా చిక్కుకున్నాడు. ఏకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే 45వేల రూపాయలను తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు జాయింట్ కలెక్టర్ తాజుద్దీన్. రేషన్ డీలర్ దగ్గర లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలవేసి పట్టుకుంది. కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్స్ వచ్చినప్పటికీ.. తాజుద్దీన్
తిరుపతి: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని, అలా అయితే అభివృద్ధి సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం రేణిగుంట ఎయిర్‌పోర్టులో రన్ వే పొడిగింపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయాలని కోరారు. ఇరు ప్రభు�
తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో స్థానం సంపాదించిన వి.శ్రీనివాస్‌గౌడ్ కూకట్‌పల్లి ప్రాంతీయులకు సుపరిచితులు. ఇక్కడి బాలాజీనగర్ కాలనీలో ఆయన మూడు దశాబ్దాలుగా నివాసముంటున్నారు. మున్సిపాలిటీలో ఉద్యోగం చేపట్టిన శ్రీనివాస్ గౌడ్..అంచలంచెలుగా ఎదిగి మున్సిపల్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. కూకట్‌పల్లి మున్సిపల్ కమ�
గుంటూరు జిల్లాలో విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఇంటి నుంచి వెళ్లిపోయి ఆరు రోజులు అవుతున్నా అమ్మాయి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సత్తెనపల్లి రంగా కాలనీకి చెందిన తులసి తొమ్మిదవ తరగతి చదువుతుంది. ఈ నెల 15న స్కూల్ కని వెళ్లిన తులసిని ఇద్దరు ఇంటర్ విద్యార్థులు తీసుకెళ్లారు
తూర్పుగోదావరి జిల్లా పొన్నాడ బషీర్ బాగ్ తీర్థంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. తీర్థానికి వచ్చి తిరిగి వెళ్తున్న రెండు కుటుంబాలకు చెందిన సుబానీ, అబ్దుల్లా తప్పిపోయారు. సుబానీ.. గుంటూరు జిల్లా చందోలుకు చెందిన చిన్నారి కాగా.. అబ్దుల్లా పొన్నూరుకు చెందిన వాడు. పిల్లలు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీర�
అనంతపురం జిల్లా కదిరిలో అక్రమంగా రవాణా చేస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఐదుగురు వ్యక్తులు అనుమానంగా కనిపించారు. వారి దగ్గర 64 జిలేటిన్ స్టిక్స్, 49 డిటోనేటర్స్ కనిపించాయి. నిందితుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరు సూర్యాప
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి బుద్వేల్‌లో ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటును తొలగించారని ఆవేదన వ్యక్తం చేసిన యువకుడు.. సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. యువకుడు కిస్మత్‌పూర్ గ్రామానికి చెందిన శ్రవణ్‌గా గుర్తించారు. సమాచారం అందిన వెంట
పవిత్ర మాఘపౌర్ణమి సందర్భంగా విశాఖ జిల్లాలో సముద్రతీరం భక్తులతో సందడిగా మారింది. సముద్ర స్నానాలు ఆచారించారు భక్తులు. అనంతరం బీచ్ ల వద్ద సూర్యనమస్కారాలతో పాటు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్కేబీచ్, రేవు పోలవరం బీచ్లకు జనం ఎక్కువ సంఖ్యలో తరలివచ్చారు. రేవు పోలవరంకు వచ్చిన భక్తులు సముద్రస్నానం చేసి, కొండపై వెలసిన వేణు�
