ఆ’పరేషన్‌’.. చిరుతపులి

పట్టపగలు..జనవాసాల మధ్య నడిరోడ్డుపై చిరుత సంచరించడం అందరినీ భయాందోళనలకు గురి చేసింది. కనిపించినట్టే కనిపించి మాయమైపోయిన చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఆపరేషన్ చిరుత మొదలుపెట్టారు.

ఆ'పరేషన్‌'.. చిరుతపులి
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 1:52 PM

పట్టపగలు..జనవాసాల మధ్య నడిరోడ్డుపై చిరుత సంచరించడం అందరినీ భయాందోళనలకు గురి చేసింది. కనిపించినట్టే కనిపించి మాయమైపోయిన చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఆపరేషన్ చిరుత మొదలుపెట్టారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ శివారు ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుత కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత జాడ మరోసారి కనిపించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో పులి తిరుగుతునట్లుగా అక్కడే అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయింది. యూనివర్సిటీ సమీపంలో తిరుగుతున్నట్లుగా గమనించిన సిబ్బంది అటవీ అధికారులను అప్రమత్తం చేశారు. చిరుత పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీలో చిరుత వెళ్లిన డైరెక్షన్‌.. అడుగుల ఆధారంగా దాన్ని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మే 14న కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి నడిరోడ్డుపై పడుకొని కలకలం సృష్టించింది. అటుగా వెళ్లేవారిని భయభ్రాంతులకు గురి చేసింది. అంతేకాదు ఓ లారీ డ్రైవర్‌పై దాడి చేసి సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. అదే సమయంలో చిరుతను పట్టుకునేందుకు అధికారులు చేసిన ప్రతయ్నం ఫలించలేదు. ఇప్పటి వరకూ చిరుత ఆచూకీ దొరకలేదు. ఇప్పుడు మళ్లీ సీసీటీవీ కెమెరాల్లో చిరుత ఆచూకీ లభ్యమైంది. మే నెలాఖరున అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సీసీటీవీ కెమెరాల్లో మళ్లీ చిరుత పులి జాడ కనిపించినట్లుగా అధికారులు చెబుతున్నారు. అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుంచి గగన్‌పహాడ్‌ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా అధికారులు గమనించారు. మళ్లీ ఆ విశ్వవిద్యాలయం చుట్టుపక్కలే చిరుత పులి సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. చిరుత పులిని పట్టుకునేందుకు ఇప్పటికే రాజేంద్రనగర్‌ ప్రాంతంలో 20 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి ఫుటేజీని అధికారులు పూర్తిగా విశ్లేషిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా చిరుత కోసం గాలింపు చర్యలు అధికారులు ముమ్మరం చేశారు. అధికారులు మొదలు పెట్టిన ఆపరేషన్ చిరుతపులి సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..