‘రైతు బంధు’కు అర్హులు వీరే.. మార్గదర్శకాలు విడుదల

రైతులను సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘రైతుబంధు’ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మార్గదర్శకాల ఉత్తర్వులను జారీ చేశారు. బడ్జెట్ ప్రతిపాదన సమయంలో జనవరి 23న సీసీఎల్‌ఏ ఇచ్చిన వివరాల్లోని పట్టాదారులకు మాత్రమే రైతుబంధు జమ కానుంది. అలాగే ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు ఈ సాయం అందనుంది. వీరితో పాటు పెద్దపల్లి జిల్లాలోని కాసుపల్లిలో దేవాదాయ భూములు చేసుకుంటున్న 621 […]

'రైతు బంధు'కు అర్హులు వీరే.. మార్గదర్శకాలు విడుదల
Follow us

| Edited By:

Updated on: Jun 16, 2020 | 5:15 PM

రైతులను సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘రైతుబంధు’ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మార్గదర్శకాల ఉత్తర్వులను జారీ చేశారు. బడ్జెట్ ప్రతిపాదన సమయంలో జనవరి 23న సీసీఎల్‌ఏ ఇచ్చిన వివరాల్లోని పట్టాదారులకు మాత్రమే రైతుబంధు జమ కానుంది. అలాగే ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు ఈ సాయం అందనుంది. వీరితో పాటు పెద్దపల్లి జిల్లాలోని కాసుపల్లిలో దేవాదాయ భూములు చేసుకుంటున్న 621 మంది పట్టాదారులకు కూడా ప్రత్యేక పరిస్థితుల్లో రైతుబంధు సాయం అందిస్తామని అందులో పేర్కొన్నారు.

కాగా రైతుబంధు కోసం ఏడాదిలో ఒకేసారి వివరాలు పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి సీజన్‌కి ముందు భూముల లావాదేవీలను పరిశీలించనున్నారు. ఒకవేళ ఎవరైనా భూములు అమ్మి ఉంటే.. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలకు తదుపరి ఆర్థిక సంవత్సరంలో ఈ సాయం ఇవ్వనున్నారు. నిధుల విడుదలలో భాగంగా మొదట తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇదిలా ఉంటే రైతు బంధు సాయాన్ని వదులుకోవాలనుకునేవారు గివ్ ఇట్ అప్‌ ఫారం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఆ మొత్తాన్ని రైతుబంధు సమితి ఖాతాకు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా వారం, పదిరోజుల్లోనే రైతులందరికీ రైతుబంధు సాయం అందాలని ఇటీవల కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: సుశాంత్‌కి నివాళులర్పించిన ‘ఇంటర్నేషనల్ స్పేస్‌ యూనివర్సిటీ’

1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ఐబ్రోస్ కి రంగు వేయించుకుని ఇంటికి వచ్చింది మర్నాడు వింతగా ఫేస్
ఐబ్రోస్ కి రంగు వేయించుకుని ఇంటికి వచ్చింది మర్నాడు వింతగా ఫేస్
ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు? కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ
ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు? కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
చిన్న కుటుంబాలకు సరిపోయే రిఫ్రిజిరేటర్లు ఇవి.. ధర రూ. 15వేలలో..
చిన్న కుటుంబాలకు సరిపోయే రిఫ్రిజిరేటర్లు ఇవి.. ధర రూ. 15వేలలో..
ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శరీరంలోని ఈ భాగాల్లో నొప్పిగా ఉందా.. అయితే జాగ్రత్త పడండి!
శరీరంలోని ఈ భాగాల్లో నొప్పిగా ఉందా.. అయితే జాగ్రత్త పడండి!
డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
రిసెప్షన్‌లో తాటి ముంజల సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం
రిసెప్షన్‌లో తాటి ముంజల సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!