పోలీసుల అదుపులో సీపీఐఎమ్ఎల్ న్యూడెమోక్రసీ కీల‌క నేత‌లు!

పోలీసుల అదుపులో సీపీఐఎమ్ఎల్ న్యూడెమోక్రసీ కీల‌క నేత‌లు!

సీపీఐఎమ్ఎల్ న్యూడెమోక్రసీ అజ్ఞాతదళ నేతలు సూర్యం, శ్యామ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  గత అర్ధరాత్రి అనారోగ్యానికి గురైన సూర్యాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. గ‌త 15 రోజులుగా పార్టీలో నాయ‌కుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా అస‌ర‌వేల్లి –  మేడ‌ప‌ల్లి గ్రామాల స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఓ ఇంట్లో వారు సేద తీరుతుండ‌గా, పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జిల్లాలో న్యూడెమోక్రసీ కార్యకర్తలు మంగళవారం […]

Jyothi Gadda

|

May 12, 2020 | 4:06 PM

సీపీఐఎమ్ఎల్ న్యూడెమోక్రసీ అజ్ఞాతదళ నేతలు సూర్యం, శ్యామ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  గత అర్ధరాత్రి అనారోగ్యానికి గురైన సూర్యాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. గ‌త 15 రోజులుగా పార్టీలో నాయ‌కుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణలు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా అస‌ర‌వేల్లి –  మేడ‌ప‌ల్లి గ్రామాల స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఓ ఇంట్లో వారు సేద తీరుతుండ‌గా, పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జిల్లాలో న్యూడెమోక్రసీ కార్యకర్తలు మంగళవారం ధర్నాకు దిగారు. పోలీసుల అదుపులో ఉన్న న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ కమాండర్ సూర్యం , శ్యామ్‌లను కోర్టులో హాజరుపర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అటు వరంగల్ రూరల్ నర్సంపేటలో న్యూడెమోక్రసీ నేతలు ధర్నా చేపట్టారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu