కోవిడ్‌ ఆసుపత్రిలో సిబ్బంది చేతివాటం.. సెల్‌ఫోన్లు, డబ్బు చోరీ

తూర్పు విజయవాడలోని లబ్బీపేట కోవిడ్‌ ఆసుపత్రిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రోగుల వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, డబ్బులను చోరీ చేస్తున్నారు.

కోవిడ్‌ ఆసుపత్రిలో సిబ్బంది చేతివాటం.. సెల్‌ఫోన్లు, డబ్బు చోరీ

Theft at Covid 19 hospital: తూర్పు విజయవాడలోని లబ్బీపేట కోవిడ్‌ ఆసుపత్రిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రోగుల వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, డబ్బులను చోరీ చేస్తున్నారు. ఇటీవల ఒక రోగి అదృశ్యంపై సీసీ కెమెరాలు పరీశీలిస్తుండగా.. చోరీ ఘటన వెలుగులోకి వచ్చాయి. అధికారులు సీసీటీవీ చూస్తుండగానే.. అక్కడ పనిచేస్తోన్న ఓ సిబ్బంది రోగి సెల్‌ఫోన్‌ని తస్కరించారు. దీన్ని చూసి వారు అవాక్కయ్యారు. అయితే తమ సెల్‌ఫోన్‌లు, డబ్బులు పోతున్నట్లు రోగులు ఆరోపించినప్పటికీ.. అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చూసినప్పటి నుంచి తస్కరించిన వ్యక్తి ఎవరన్న దానిపై కూపీ లాగుతున్నారు. ఇలా మిగిలిన వారు ఎవరెవరు చోరీకి పాల్పడుతున్నారు..? వారి ప్రవర్తన ఏంటని అధికారులు ఆరా తీస్తున్నారు.

ముఖ్యంగా ఐసోలేషన్‌ వార్డు, ఐసీయూలోని రోగుల వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, వస్తువులు, డబ్బులు మాయం అవుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న రోగుల వద్దకు అటెండెంట్‌లను అనుమతించరు. వారికి ఏమి కావాలన్నా సిబ్బంది చూసుకోవాల్సిందే. దీనిని అనుకూలంగా మలుచుకున్న కొందరు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై మాట్లాడిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.నాంచారయ్య.. ”వ్యక్తి అదృశ్యంపై సీసీ కెమెరా దృశ్యాలను చూస్తుండగా.. ఒక రోగి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ని ఉద్యోగి తీయడాన్ని గుర్తించాం. ఆ ఉద్యోగి పీపీఈ కిట్‌లో ఉండటంతో ఎవరనే విషయాన్ని విచారిస్తున్నాము. రోగి పట్ల సేవా భావంతో చూడాలే కానీ ఇలా చేయడం సరికాదు. అలా చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.

Read This Story Also: చెర్రీతో పూరీ పాన్ ఇండియా మూవీ!

Click on your DTH Provider to Add TV9 Telugu