అల్లాదుర్గం సంస్థానంలో అద్భుతం..200 ఏళ్ల క్రితం నాటి..

మెదక్ జిల్లా అల్లాదుర్గంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 200 ఏళ్ల క్రితం నాటి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడకు క్యూ కడుతున్నారు.

అల్లాదుర్గం సంస్థానంలో అద్భుతం..200 ఏళ్ల క్రితం నాటి..
Jyothi Gadda

|

Jun 17, 2020 | 1:37 PM

మెదక్ జిల్లా అల్లాదుర్గంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 200 ఏళ్ల క్రితం నాటి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడకు క్యూ కడుతున్నారు.

మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలోని స్థానిక సంస్థానంలో ఈర్ల ప్రేమ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి తన పురాతన ఇంటిని కూల్చేసి దాని స్థానంలో కొత్త భవన నిర్మాణం కోసం పునాదులు తీస్తున్నారు. పునాదులు తీస్తుండగా, ఓ పెద్ద బండరాయి అడ్డుతగలడంతో దానిని పక్కకు తొలగించారు. దాంతో బండరాయి కింద ఓ అరుదైన పురాతన బావి బయటపడింది. ఈ బావి దాదాపు 200 ఏళ్ల క్రితం తవ్వి ఉంటారని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ బావి నిజాం కాలంలో తవ్వించినట్లుగా చెబుతున్నారు. 30 అడుగుల లోతుతో చుట్టూ వృత్తాలుగా ఏర్పడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపించిన ఆ బావిని చూసిన స్థానికులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu