నాడు ‘కత్తి’.. నేడు ‘కొడవలి’: టెన్షన్‌లో విశాఖ ఎయిర్‌పోర్టు

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం చోటుచేసుకుంది. ఓ కొడవలితో ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. పార్కింగ్ ఇన్‌గేట్ వరకు ఆ వ్యక్తి వెళ్లాడు. అయితే వెంటనే అప్రమత్తమైన అక్కడి సీఆర్పీఎఫ్ పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని పరవాడకు చెందిన లోవరాజుగా గుర్తించారు. అయితే గత ఏడాది ఇదే ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి జరిగింది. హైదరాబాద్‌కు వెళ్తోన్న ఆయనపై శ్రీనివాసరావు అనే వ్యక్తి పందెం కోళ్లకు కట్టే కత్తితో దాడి చేశాడు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:38 pm, Fri, 24 May 19
నాడు ‘కత్తి’.. నేడు ‘కొడవలి’: టెన్షన్‌లో విశాఖ ఎయిర్‌పోర్టు

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం చోటుచేసుకుంది. ఓ కొడవలితో ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. పార్కింగ్ ఇన్‌గేట్ వరకు ఆ వ్యక్తి వెళ్లాడు. అయితే వెంటనే అప్రమత్తమైన అక్కడి సీఆర్పీఎఫ్ పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని పరవాడకు చెందిన లోవరాజుగా గుర్తించారు. అయితే గత ఏడాది ఇదే ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి జరిగింది. హైదరాబాద్‌కు వెళ్తోన్న ఆయనపై శ్రీనివాసరావు అనే వ్యక్తి పందెం కోళ్లకు కట్టే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో జగన్‌ భుజానికి స్వల్పగాయమైంది. ఇక తాజాగా మరోవ్యక్తి వేట కొడవలితో ఇలా ఎయిర్‌పోర్టులోకి రావడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.