గుడ్ న్యూస్..లాక్‌డౌన్‌లో ఎల‌క్ట్రానిక్ అమ్మ‌కాల‌కు అనుమ‌తి !

లాక్‌డౌన్ వేళ‌ ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అనేక వ్యాపార సంస్థ‌లు త‌మ గేట్ల‌కు తాళాలు వేసుకున్నాయి. ఈ త‌రుణంలో కొన్ని ఆన్‌లైన్ వ్యాపార సంస్థ‌లు త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగించేందుకు రెడీ అవుతున్నాయి.

గుడ్ న్యూస్..లాక్‌డౌన్‌లో ఎల‌క్ట్రానిక్ అమ్మ‌కాల‌కు అనుమ‌తి !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 16, 2020 | 2:13 PM

లాక్‌డౌన్ వేళ‌ ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అనేక వ్యాపార సంస్థ‌లు త‌మ గేట్ల‌కు తాళాలు వేసుకున్నాయి. ఈ త‌రుణంలో కొన్ని ఆన్‌లైన్ సంస్థ‌లు త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగించేందుకు రెడీ అవుతున్నాయి. ఏసీ, ఫ్రిజ్, కూలర్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త నందించాయంటూ ప్ర‌ముఖ వార్త ప‌త్రిక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈ మేర‌కు..
ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి ఏప్రిల్ 20 నుంచి క‌స్ట‌మ‌ర్ల నుంచి ఆర్డ‌ర్లు తీసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లాక్ డౌన్ మార్గదర్శకాల్లో ఎసెన్సియల్, నాన్ ఎసెన్షియల్ గూడ్స్ వర్గీకరణ లేదని ఈకామర్స్ సంస్థలు పేర్కొంటున్నాయి. అందుకే ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టుల డెలివరీకి సిద్ధమ‌వుతున్నాయి. ఏప్రిల్ 18 నుంచి నాన్ ఎసెన్షియల్ ప్రొడక్టులకు సంబంధించి ఆర్డర్లు తీసుకుంటామని ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారని స‌ద‌రు వార్తా ప‌త్రిక‌ పేర్కొంది. ఏప్రిల్ 20 నుంచి అమెజాన్ ఇండియాలో ఆర్డర్లు తీసుకునే ఛాన్స్ ఉందని మర్చంట్ ఒకరు తెలిపారు.
అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉందని, కేంద్రం నుంచి ఆమోదం పొందిన తర్వాత కంపెనీ తన మర్చంట్లకు ఏ విషయాన్ని తెలియజేయవచ్చని వివరించారు.
కాగా మహరాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఈకామర్స్ వెబ్‌సైట్ల ద్వారా ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ విక్రయించొచ్చని ఆర్డర్లు జారీ చేసింది. ఇది సానుకూల ప్రారంభమని సేఫ్‌ఎక్స్‌ప్రెస్ ఎండీ రుబల్ జైన్ తెలిపారు. అయితే అన్ని ప్రాంతాల్లో డెలివరీ అందుబాటులో ఉండకపోవచ్చనే విషయాన్ని కన్సూమర్లు గుర్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌రోవైపు ఆన్‌లైన్ మోస‌ల నుంచి కూడా ప్ర‌జ‌లు జాగ్ర‌త్త ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!