లాక్‌డౌన్‌ ఆంక్షలను బేఖాతరు చేసిన గోల్డ్ షోరూం.. కేసు నమోదు

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ను కఠినంగా పాటించాలని అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి.

లాక్‌డౌన్‌ ఆంక్షలను బేఖాతరు చేసిన గోల్డ్ షోరూం.. కేసు నమోదు
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 9:43 AM

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌ను కఠినంగా పాటించాలని అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినా కొందరికి మాత్రం ఇది పట్టడం లేదు. లాక్‌డౌన్‌ ఆంక్షలను బేఖాతరు చేస్తూ అందరికీ ఇబ్బందులను పెడుతున్నారు. తాజాగా విజయవాడలోని ఓ గోల్డ్‌ షోరూం లాక్‌డౌన్‌ ఆంక్షలను బేఖాతరు చేసింది. అక్షయ తృతీయ బిజినెస్‌ను క్యాష్ చేసుకునే పనిలో భాగంగా షటర్ మాటున దర్జాగా బంగారం విక్రయాలు జరుపుతోంది. కనీసం మాస్కులు కూడా లేకుండా దొంగచాటుగా వ్యాపారం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కృష్ణలంక పోలీసులు.. షాపు యజమానులను అదుపులోకి తీసుకున్నారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో బంగారం అమ్మకాలు చేయొద్దని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

Read This Story Also: డబ్బు విషయంలో అలా ఉన్నా కాబట్టే.. 23 మందికి పెళ్లి చేశా..!