మళ్లీ అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి మళ్లీ అరెస్ట్ అయ్యారు. అట్రాసిటీ కేసులో ఆ ఇద్దరిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.

మళ్లీ అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి

JC Prabhakar Reddy and his son arrest: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి మళ్లీ అరెస్ట్ అయ్యారు. అట్రాసిటీ కేసులో ఆ ఇద్దరిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రి స్టేషన్‌లో సీఐ దేవేంద్ర కుమార్‌పై అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఆ ఇద్దరి మీద కేసు నమోదైంది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కూడా వారిపై కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ వివరించారు. కాగా వాహనాల రిజిస్ట్రేషన్‌లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత వీరిద్దరిని కడప జైలుకు తరలించారు. అయితే గురువారం బెయిల్‌పై విడుదలైన ఈ ఇద్దరు తాడిపత్రికి వచ్చారు. వచ్చే క్రమంలో పలుచోట్ల నిబంధనలను ఉల్లంఘించారంటూ వీరిపై ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ఇద్దరిని మరోసారి అరెస్ట్ చేశారు.

Read This Story Also: కన్నడ నాట ‘సరిలేరు’ అనిపించిన మహేష్‌

Click on your DTH Provider to Add TV9 Telugu