దేశ రాజధానిలో కలకలం.. ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య..

దేశ రాజధాని ఢిల్లీలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు చెందిన ఓ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలోని బాపూదామ్‌ ప్రాంతంలోని తన నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. డీసీపీ ఈష్ సింఘాల్‌ కూడా చేరుకుని సంఘటనా స్థలిని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ గదిలో ఓ సూసైడ్‌ నోట్ కూడా లభించిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 5:20 pm, Wed, 27 May 20