నాలాల‌పై అక్రమకట్టడాలు… కూల్చివేత‌లు ప్రారంభం

హైదరాబాద్‌లో చెరువులు, నాలాల భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దగ్గరుండి కూల్చివేత పనులను పర్యవేక్షించారు.

నాలాల‌పై అక్రమకట్టడాలు… కూల్చివేత‌లు ప్రారంభం
Follow us

|

Updated on: Oct 17, 2020 | 5:33 PM

భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలం అయ్యింది. పట్టణంలో పలు చోట్ల నాలాలు ఉప్పొంగి కాలానీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావటంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల రోడ్లు, బస్తీలు చెరువులను తలపించాయి. అయితే, నగరంలో ఈ దుస్థితి కారణం నాలాల అక్రమ కట్టడాలుగా గుర్తించిన అధికారులు వాటి తొలిగింపు దిశగా చర్యలు మొదలు పెట్టారు.

హైదరాబాద్‌లో చెరువులు, నాలాల భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైంది. శనివారం జీహెచ్‌ఎంసీ సిబ్బంది మల్కాజ్‌గిరితోపాటు పటేల్‌నగర్‌లో నాలాలపై అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చి వేశారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో అక్రమకట్టడాలను జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ మల్కాజ్‌గిరి ప్రాంతంలో పర్యటించి అక్రమ కట్టడాల కూల్చివేతకు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దగ్గరుండి కూల్చివేత పనులను పర్యవేక్షించారు. నాలుగురోజుల కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమైన సంగతి తెలిసిందే. చెరువు శిఖాలు, నాలాల భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కారణం వరద వెల్లేందుకు వీల్లేక ఈ పరిస్థితి దాపురించిందని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులను ఆదేశించింది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..