ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముఠా గుట్టురట్టు

సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసి ముఠాను కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద నుంచి 3 నుంచి 4 లక్షల వరకు వసూలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. కాగా.. సాయం ప్రసాద్, నాగేంద్ర ప్రసాద్ అనే ఇద్దరు ప్రభుత్వ టీచర్స్ కలిసి ఓ ముఠాగా ఏర్పడి నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. ఇలా వసూలైన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని.. ఖరీదైన కార్లలలో తిరుగుతున్నారని […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:34 am, Tue, 26 February 19
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముఠా గుట్టురట్టు

సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేసి ముఠాను కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి వద్ద నుంచి 3 నుంచి 4 లక్షల వరకు వసూలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. కాగా.. సాయం ప్రసాద్, నాగేంద్ర ప్రసాద్ అనే ఇద్దరు ప్రభుత్వ టీచర్స్ కలిసి ఓ ముఠాగా ఏర్పడి నిరుద్యోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. ఇలా వసూలైన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని.. ఖరీదైన కార్లలలో తిరుగుతున్నారని పోలీసుల విచారణలో నిజాలు బయటపడ్డాయి.