నాగార్జున సాగర్‌లోని చేపలు తింటున్నారా..? ఇక అంతే..!!

నాగార్జున సాగర్‌లోని చేపలు తింటున్నారా..? ఇక అంతే..!!

మీరు ఇప్పుడు నాగార్జున సాగర్‌కి వెళ్తున్నారా..? అక్కడే ఉన్న చేపలను తింటున్నారా..? అయితే.. మీకో షాకింగ్ న్యూస్..! నాగార్జున సాగర్‌.. ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు. అందులోనూ.. ఆ జలపాతాలను చూస్తే.. ఎంతసేపైనా.. అక్కడే ఉండాలనిపిస్తుంది. అందుకే.. నాగార్జున సాగర్‌కి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పైనుంచి కిందకు జాలు వారుతున్న నీటి అందాలు చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతారు. ఆ అపురూప దృశ్యం చూసి పరవశించిపోతారు. ఇక అందులోనూ ఆదివారమైతే.. నాగార్జున సాగర్‌కు […]

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Oct 16, 2019 | 5:02 PM

మీరు ఇప్పుడు నాగార్జున సాగర్‌కి వెళ్తున్నారా..? అక్కడే ఉన్న చేపలను తింటున్నారా..? అయితే.. మీకో షాకింగ్ న్యూస్..!

నాగార్జున సాగర్‌.. ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు. అందులోనూ.. ఆ జలపాతాలను చూస్తే.. ఎంతసేపైనా.. అక్కడే ఉండాలనిపిస్తుంది. అందుకే.. నాగార్జున సాగర్‌కి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పైనుంచి కిందకు జాలు వారుతున్న నీటి అందాలు చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతారు. ఆ అపురూప దృశ్యం చూసి పరవశించిపోతారు. ఇక అందులోనూ ఆదివారమైతే.. నాగార్జున సాగర్‌కు పర్యాటకులు పోటెత్తుతారు. దీంతో.. కిలో మీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. అందులోనూ.. చల్లటి సాయంత్రం వేళ.. సాగర్.. శబ్ధాల నడుమ.. అక్కడ సేద తీరుతూ.. కొంతమంది పర్యాటకులు.. అక్కడే ఉన్న కాలువల్లోనుంచి.. చేపలను పట్టి.. ఫ్రై రూపంలో.. లేక పులుసులా వండించుకుని తింటారు. అదో రకమైన ఆనందానుభూతి.

కానీ.. ఈ సమయంలో.. మాత్రం తింటే.. మీరు ఖచ్చితంగా అనారోగ్యానికి గురవుతారు..! ఎందుకని అనుకుంటున్నారా..! నాగార్జున సాగర్‌ నీటిలో.. యురేనియం కలుస్తుందట. అది ప్రాణానికి ఎంత హాని చేస్తుందో.. మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. ఈ మధ్య యురేనియం తవ్వకాలపై.. పెద్ద ఎత్తున ఆందోళనలు అల్లుకున్నాయి. అందులోనూ.. అక్కడే తిరిగాడే.. చేపలను తింటే.. ఉన్న ఆరోగ్యం పక్కన పెడితే.. లేనిపోని సమస్యలు మరిన్ని ఎక్కువవుతాయి.

యురేనియం వల్ల కలిగే నష్టాలు:

యురేనియంలో.. సీసం 75 శాతం అధికంగా ఉంటుంది. ఇక నీటిలో కలిస్తే.. మానవుడు చాలా దుష్పలితాలకు గురికావాల్సి ఉంటుంది యురేనియం కలిసిన నీటిని ఒక్కసారి తాగినా ప్రమాదకరమే. దీని వల్ల జన్యుపరమైన లోపాలు తలెత్తుతాయి. యురేనియంలోని గామా కిరణాలు ఉంటాయి. ఇది ఎంతటి బలమైన కాంక్రీటునైనా విచ్ఛిన్నం చేయగలిగే శక్తి ఉంటుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu