ఆమెకు ఆశ్రయమిచ్చారో.. మీరూ కటకటాల పాలే.. ఏసీబీ హెచ్చరికలు

భూ సమస్య పరిష్కారం కోసం తన వద్దకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.4లక్షల లంచాన్ని డిమాండ్ చేస్తూ కర్నూల్ జిల్లా గూడురు తహశీల్దార్ హసీనాబీ ఏసీబీకి అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధం కాగా.. ఆ విషయం తెలుసుకున్న హసీనాబీ ఆ రోజు నుంచి పరారీలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఎవ్వరూ ఆశ్రమం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ఏసీబీ కేసులో హసీనాబీ ముద్దాయిగా ఉన్నారని, […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:27 am, Mon, 11 November 19
ఆమెకు ఆశ్రయమిచ్చారో.. మీరూ కటకటాల పాలే.. ఏసీబీ హెచ్చరికలు

భూ సమస్య పరిష్కారం కోసం తన వద్దకు వచ్చిన ఓ వ్యక్తి నుంచి రూ.4లక్షల లంచాన్ని డిమాండ్ చేస్తూ కర్నూల్ జిల్లా గూడురు తహశీల్దార్ హసీనాబీ ఏసీబీకి అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధం కాగా.. ఆ విషయం తెలుసుకున్న హసీనాబీ ఆ రోజు నుంచి పరారీలో ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఎవ్వరూ ఆశ్రమం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు.

ఏసీబీ కేసులో హసీనాబీ ముద్దాయిగా ఉన్నారని, ఆమెకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు హసీనాబీ ఆచూకీ కోసం ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో పలు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలను చేపడుతున్నాయి.

కాగా గూడురుకు చెందిన సురేష్ అనే వ్యక్తి తన భూ సమస్య పరిష్కారం కోసం నెల క్రితం తహశీల్దార్ హసీనాబీని ఆమె కార్యాలయంలో సంప్రదించాడు. దీంతో ఆమె రూ.8లక్షలు డిమాండ్ చేసింది. చివరకు రూ.4లక్షలకు బేరం కుదరడంతో.. లంచం సొమ్ము తీసుకునేందుకు మధ్యవర్తిని పంపింది. అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేయగా.. సురేష్ నుంచి లక్షరూపాయలు తీసుకుంటున్న మధ్యవర్తి మహబూబ్‌ బాషాను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హసీనాబీ అప్పటి నుంచి పరారీలో ఉంది. ఇక మహబూబ్‌ భాషాను శనివారం కోర్టులో హాజరు పరచగా.. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.