కరోనా ఎఫెక్ట్‌: నేటి నుంచి తిరుపతిలో కఠిన నిబంధనలు

తిరుపతిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 2,200ను దాటేసింది. దీంతో తిరుపతిలో మరోసారి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా ప్రకటించారు.

  • Tv9 Telugu
  • Publish Date - 10:02 am, Tue, 21 July 20
కరోనా ఎఫెక్ట్‌: నేటి నుంచి తిరుపతిలో కఠిన నిబంధనలు

తిరుపతిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 2,200ను దాటేసింది. దీంతో తిరుపతిలో మరోసారి లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా ప్రకటించారు. వచ్చే నెల 4వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు, నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.

మొత్తం 50 డివిజన్లలో 48 డివిజన్లను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించగా… ఈ జోన్లలో ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతిని ఇచ్చారు. 11 తర్వాత అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరు రోడ్ల మీదికి రావొద్దని పోలీసులు సూచించారు. మరోవైపు తిరుమల దర్శనాలకు వెళ్లే వాహనాలకు నగరంలోని బైపాస్‌ రోడ్డు నుంచి పోలీసులు అనుమతిని ఇస్తున్నారు. ఇక తిరుపతిలో ఆంక్షల నేపథ్యంలో తిరుమల శ్రీవారి సర్వ దర్శన టోకెన్లను టీటీడీ నిలిపివేసింది.