కూర ‘గాయాల’ ధరలతో గుండె గుభేలు..!

నిత్యం పెరుగుతోన్న కూరగాయల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొదట కూరగాయల రేటు వింటుంటేనే.. వినియోగదారుల గుండె గుభేలమంటోంది. తాజాగా.. ఉల్లిపాయలు, టమోటాల రేటు పెరిగింది. దీంతో.. అవసరానికి మాత్రమే వాటిని కొంటున్నారు. ఇక ఇప్పుడు వీటితో పాటు కూరగాయల ధరలు కూడా పెరిగి.. వినియోగదారులకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. పెరిగిన కూరగాయల ధరల కారణంగా ఏమీ తినేటట్టు లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు కూడా ఆకాశానికి పెరగడంతో.. […]

కూర 'గాయాల' ధరలతో గుండె గుభేలు..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 11, 2019 | 2:15 PM

నిత్యం పెరుగుతోన్న కూరగాయల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొదట కూరగాయల రేటు వింటుంటేనే.. వినియోగదారుల గుండె గుభేలమంటోంది. తాజాగా.. ఉల్లిపాయలు, టమోటాల రేటు పెరిగింది. దీంతో.. అవసరానికి మాత్రమే వాటిని కొంటున్నారు. ఇక ఇప్పుడు వీటితో పాటు కూరగాయల ధరలు కూడా పెరిగి.. వినియోగదారులకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. పెరిగిన కూరగాయల ధరల కారణంగా ఏమీ తినేటట్టు లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటు మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు కూడా ఆకాశానికి పెరగడంతో.. ముఖ్యంగా పేదలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. ఆఖరికి రైతు బజార్‌లో కూడా అన్ని కూరగాయల ధరలు రూ.40లకి పైగానే పలుకుతున్నాయి. ఇక.. సాధారణ కూరగాయల మార్కెట్స్‌లో అయితే.. కొనాల్సిన అవసరం లేదనుకోండి. అయితే.. అనుకున్న దానికంటే.. వర్షాపాతం రేటు ఎక్కువగా.. ఉండటంతో.. పంట దిగుబడి బాగా దెబ్బతింది. దీంతో.. కూరగాయల రేట్లు అధికంగా అయ్యాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అందులోనూ ప్రస్తుతం కార్తీకమాసం నడుస్తుండటంతో.. కూరగాయలకు డిమాండ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కార్తీకమాసాన్ని పాటిస్తారు. అంతేకాకుండా ఎక్కువగా.. ఈ మాసంలోనే.. భవానీలు, అయ్యప్పలు మాల ధరిస్తారు. దీంతో.. అందరూ శాఖాహారాన్నే భుజిస్తారు. ఇది కూడా ధరలు పెరిగేందుకు ఒక రకమైన కారణమని చెప్పవచ్చు. కార్తీక మాసం అయ్యేవరకు ఈ ఇబ్బందులు తప్పవని.. డిసెంబర్ నెల నాటికి అన్ని ధరలు అదుపులోకి వస్తాయని వర్తకులు చెబుతున్నారు.

కాగా.. ప్రస్తుతం మార్కెట్లో.. కూరగాయల ధరలు:

 • ఉల్లిపాయలు (కిలో) రూ. 70-100
 • టమోటో (కిలో)          రూ. 30-50
 • పచ్చిమిర్చి (కిలో)    రూ. 50-70
 • పెద్దచిక్కుడు           రూ.  76
 • కాకరకాయలు           రూ. 55
 • క్యాప్సికం                  రూ. 50
 • దొండకాయలు         రూ. 43
 • బీరకాయలు             రూ. 46
 • వంకాయలు             రూ. 40
 • బీట్‌ రూట్               రూ. 45
 • క్యారెట్                     రూ. 60
 • ఫ్రెంచ్ బీన్స్          రూ. 50

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu