జనవరి 1 నుంచి సమగ్ర భూసర్వే చేపట్టండి: జగన్

జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోమన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

జనవరి 1 నుంచి సమగ్ర భూసర్వే చేపట్టండి: జగన్
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2020 | 4:15 PM

YS Jagan review: జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోమన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే 2023 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. సమగ్ర భూ సర్వేపై సమీక్ష నిర్వహించిన జగన్‌ అనంతరం మాట్లాడుతూ.. అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే చేపట్టాలని అన్నారు. సర్వే బృందాలను పెంచి ఎక్కడి వివాదాలను అక్కడే పరిష్కరించాలని సూచించారు.

భూ వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. సమగ్ర భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానంపై సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని వివరించారు. కాగా ఈ సర్వేలో రెవెన్యూ , ఇతర శాఖల అధికారులు, సర్వేయర్లతో పాటు ఎమ్మార్వోలు కూడా రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. కాగా కొత్త జిల్లాల ఏర్పాటు, భూముల రీసర్వే ఏకకాలంలో పూర్తి చేయాలని గతంలో జగన్ ప్రభుత్వం భావించింది. అయితే అది సాధ్యం అవ్వకపోగా.. వేర్వేరుగా ఈ రెండు పనులను చేపట్టేందుకు సిద్ధమైంది.

Read More:

‘సాహో’ను గుర్తు చేసుకున్న టీమ్‌!

రైనాపై చెన్నై జట్టు యజమాని సంచలన వ్యాఖ్యలు