జగన్ మరో కీలక నిర్ణయం.. తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందికి జీతాల పెంపు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తోన్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.

జగన్ మరో కీలక నిర్ణయం.. తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందికి జీతాల పెంపు

Jagan review meeting on Covid 19: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తోన్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. కోవిడ్ 19 ఆసుపత్రుల సంఖ్యను 138 నుంచి 287కు పెంచినట్లు తెలిపారు.స్పెషలిస్ట్‌లు, డాక్టర్లను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ప్రతి ఆసుపత్రిలోనూ సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలని, లోపాలు లేకుండా చూసుకోవాలని వెల్లడించారు. నిరంతరం ప్రమాణాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఇక అందిస్తున్న సేవలకు అనుగుణంగా కరోనా ఆసుపత్రులకు రేటింగ్ ఇవ్వాలని తెలిపారు. కాల్‌ సెంటర్‌లతో పాటు ఆస్పత్రుల్లోని హెల్ప్‌ డెస్క్‌లు సమర్థవంతంగా పనిచేయాలని జగన్ ఆదేశించారు.

హోంక్వారంటైన్‌లో ఉన్నవారికి సేవలు సక్రమంగా అందాలని.. మందులు ఇవ్వడం, చికిత్స అందించడం, వారి సందేహాలకు ఎప్పటికప్పుడు తీర్చే విధంగా వ్యవస్థ సక్రమంగా ఉండాలని సీఎం అన్నారు. ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేషెంట్లకు అత్యుత్తమ సేవలు అందాలని, ఆరోగ్యశ్రీ సేవల సమాచారం తెలుసుకునేందుకు, ఏవైనా ఫిర్యాదులు చేసేందుకు ఓ కాల్ సెంటర్ ఉండాలని సూచించారు. ఆ నంబర్‌ని అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో బోర్డుపై ఉంచాలని, ట్రీట్‌మెంట్ చేయకుండానే రిఫర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని గట్టిగా చెప్పాలని వెల్లడించారు. అలాగే ఆరోగ్య ఆసరా పనితీరును కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. డెలివరీ అవగానే తల్లికి డబ్బు ఇచ్చే కార్యక్రమం అమలు ఎలా జరుగుతుందో పరిశీలించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Read More:

నా భర్త గొడవ పడటం లేదు.. విడాకులు ఇప్పించండి

సుశాంత్ కేసు: సీబీఐ ముందుకు కొత్త వ్యక్తి.. ఎవరతను!

Click on your DTH Provider to Add TV9 Telugu