పశువులకు హాస్టల్స్..ఎక్కడో కాదు..

పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మంత్రి హరీష్ రావు చొరవతో గ్రామాల్లో హాస్టల్స్ నిర్మిస్తున్నారు. పాడి పశువులు అనారోగ్యానికి గురికాకుండా చూడటం..

పశువులకు హాస్టల్స్..ఎక్కడో కాదు..
Follow us

|

Updated on: Jun 27, 2020 | 9:44 AM

అక్కడ పశువుల హాస్టల్స్ నిర్మిస్తున్నారు. పశువులకు హాస్టలా? అనిమనమంతా ఆశ్చర్యపోవచ్చు. కాని అది నిజం సిద్ధిపేటలో పశువులకు హాస్టల్స్ నిర్మిస్తున్నారు. పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మంత్రి హరీష్ రావు చొరవతో గ్రామాల్లో హాస్టల్స్ నిర్మిస్తున్నారు.

పాడి పశువులు అనారోగ్యానికి గురికాకుండా చూడటం.., పాల ఉత్పత్తి పెంచడంతో పాటు పల్లెల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణే లక్ష్యంగా పశువుల హాస్టల్స్ నిర్మిస్తున్నారు. ఇబ్రహీంపూర్‌, ఇర్కోడ్‌, నర్మెట.. మూడు గ్రామాల్లో సాముహిక గొర్రెల పాకలు నిర్మించడంతో సత్ఫలితాలు వచ్చాయి.

గ్రామానికి చెందిన అన్ని గొర్రెలు ఒకేచోట ఉండటంతో కాపలా సులభమైంది. ఊర్లలోనూ పారిశుద్ధ్యం మెరుగుపడింది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు పశువులకూ వసతి గృహాలు- హాస్టల్స్‌ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దీంతో పొన్నాల, ఇరుకోడ్, మిట్టపల్లి, ఇబ్రహీంపూర్, జక్కపూర్, గుర్రాలగొంది, నర్మెట, గట్లమాల్యాల గ్రామాల్లో ఈ పశువుల హాస్టల్ నిర్మాణాలు చేపట్టారు. త్వరలోనే వీటిని పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు అధికారులు.

ఒక్కో హాస్టల్ ను దాదాపు రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. పాడిపశువులకు ఇబ్బంది కల్గకుండా ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. ఎండాకాలంలో ఫ్యాన్, వాన కాలంలో తడవకుండా రూఫ్, చలికాలంలో పశువులకు చలి పెట్టకుండా చుట్టుపక్కల గోడలు, ఓపెన్ ఉన్న వైపు చిన్న టార్ఫాలిన్ లు ఏర్పాటు చేస్తున్నారు. సీజన్ ఏదైనా.. పశువులు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానికంగా పశువుల హాస్టల్స్ ఏర్పాటు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.