కరోనా రోగులు ఆరోగ్యశ్రీ కార్డుని మరవకండి

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితులు తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్‌ కార్డు తీసుకుని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లాలని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగార్జున తెలిపారు

కరోనా రోగులు ఆరోగ్యశ్రీ కార్డుని మరవకండి
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 3:14 PM

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితులు తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్‌ కార్డు తీసుకుని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లాలని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగార్జున తెలిపారు. ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఆధార్‌ కార్డు ఆధారంగా సీఎంసీఓ లెటర్‌ను తీసుకెళ్లాలని ఆయన వెల్లడించారు. అలా తీసుకెళ్లినప్పుడు మాత్రమే ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతాయని వెల్లడించారు. ఇక 104, 108 సిబ్బంది కరోనా రోగులను తరలించేటప్పుడు.. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని రావాలని బాధితులకు చెప్పాలని కోరారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని రాకుండా చాలా మంది రోగులు ఆసుపత్రులకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసేందుకు ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.