CBI విచారణ ఎక్కడ్నుంచి జరగాలి?.. 2004 ఆ..? లేదా 2014 ఆ..?

ఏపీ రాజకీయాలు గతకొద్ది రోజులుగా హాట్ హాట్‌గా మారయన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మూడు రాజధానుల అంశం.. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధానికి దారితీస్తోంది. ఈ క్రమంలో అమరావతి భూముల అంశం కీలక మలుపు తిరిగింది. ఇన్నాళ్లు CID ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవహారంలోకి కాస్త.. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎంటర్ అయ్యింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం సైలెంట్‌గా రాజధాని తరలింపుపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు విపక్షం అడ్డుకోవడానికి సెలక్ట్ కమిటీ వ్యూహానికి పదునుపెడుతోంది. […]

CBI విచారణ ఎక్కడ్నుంచి జరగాలి?.. 2004 ఆ..? లేదా 2014 ఆ..?
Follow us

| Edited By:

Updated on: Feb 04, 2020 | 5:13 AM

ఏపీ రాజకీయాలు గతకొద్ది రోజులుగా హాట్ హాట్‌గా మారయన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మూడు రాజధానుల అంశం.. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధానికి దారితీస్తోంది. ఈ క్రమంలో అమరావతి భూముల అంశం కీలక మలుపు తిరిగింది. ఇన్నాళ్లు CID ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవహారంలోకి కాస్త.. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎంటర్ అయ్యింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం సైలెంట్‌గా రాజధాని తరలింపుపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు విపక్షం అడ్డుకోవడానికి సెలక్ట్ కమిటీ వ్యూహానికి పదునుపెడుతోంది. ఈ క్రమంలో ఇక అమరావతి రైతుల ఉద్యమం పార్లమెంట్ పాకితే.. రాజధాని పేరుతో జరిగిన అక్రమాలపై CBI విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా.. రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకుండానే..వికేంద్రీకరణ జరిగిపోతోందా..? అదే విధంగా ఈడీ ఎంట్రీతో ఎట్లాంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. రాజధానిలో ఇన్‌సైడెడ్ ట్రేడింగ్‌ పేరుతో జరుగుతున్న ఆరోపణల విషయంపై.. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ కార్యక్రమం జరిగింది. ఈ చర్చలో భాగంగా.. సీఐడీ రిఫరెన్స్ మేరకు ఈడీ కేసు నమోదు చేసిన దానిపై చర్చ హాట్‌హాట్‌గా కొనసాగింది. వైట్ రేషన్ కార్డులు ఉన్న వారు.. అంత పెద్ద మొత్తంలో భూములు ఎలా కొన్నారు. వారికి పాన్ కార్డులు కూడా లేవన్న దానిపై ఎంక్వైరీ నిమిత్తం ఈడీ కేసు నమోదు చేసిందన్న దానిపై చర్చ జరుగుతుండగా.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో సీఎం జగన్‌పై టీడీపీ నేత సంచలన ఆరోపణలు చేశారు. అవేంటో ఈ వీడియోలో చూడండి.