చంద్రబాబు కుటిల రాజకీయాలు తెలుసు : మంత్రి బొత్స

చంద్రబాబు కుటిల రాజకీయాలు తెలుసు : మంత్రి బొత్స

తెలుగు దేశం పార్టీ చేపట్టిన ఛలో ఆత్మకూరు యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చేసే జిమ్మిక్కులు తమకు తెలుసని.. శాంతి భద్రతల విషయాల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో కుటిల రాజకీయాలు చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు. పలు చోట్ల టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతలు యరపతినేని, చింతమనేని, కూన రవి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోడెల తప్పుచేయలేదని చెప్పేధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 11, 2019 | 1:08 AM

తెలుగు దేశం పార్టీ చేపట్టిన ఛలో ఆత్మకూరు యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చేసే జిమ్మిక్కులు తమకు తెలుసని.. శాంతి భద్రతల విషయాల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో కుటిల రాజకీయాలు చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు.

పలు చోట్ల టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతలు యరపతినేని, చింతమనేని, కూన రవి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోడెల తప్పుచేయలేదని చెప్పేధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో యరపతినేని క్వారీ పరిశీలనకు తాను వెళితే అరెస్టు చేయలేదా? అంటూ బొత్స మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో ఎలాంటి సమస్య లేకున్నా.. సంవత్సరాల తరబడి సెక్షన్ 30 అమల్లో పెట్టలేదా అంటూ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు ఎవరూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదన్నారు. చట్టాలను అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవంటూ మంత్రి బొత్స హెచ్చరించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu