Sacred Heart School: తల్లిదండ్రుల ఆందోళనపై ప్రభుత్వం విచారణ.. టీసీలు ఇస్తామని చెప్పలేదన్న యాజమాన్యం..

సోమవారం ఆంధ్రప్రదేశ్‎ విశాఖపట్నంలోని సెక్రెడ్ హార్ట్ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. బలవంతపు విలీనం లేదని ప్రభుత్వం ప్రకటించినా టీసీలు తీసుకెళ్లమని చెప్పిన యాజమాన్యాన్ని విద్యా శాఖ వివరణ కోరింది...

Sacred Heart School: తల్లిదండ్రుల ఆందోళనపై ప్రభుత్వం విచారణ.. టీసీలు ఇస్తామని చెప్పలేదన్న యాజమాన్యం..
School
Follow us

|

Updated on: Oct 26, 2021 | 1:03 PM

సోమవారం ఆంధ్రప్రదేశ్‎ విశాఖపట్నంలోని సెక్రెడ్ హార్ట్ పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. బలవంతపు విలీనం లేదని ప్రభుత్వం ప్రకటించినా టీసీలు తీసుకెళ్లమని చెప్పిన యాజమాన్యాన్ని విద్యా శాఖ వివరణ కోరింది. టీసీలు ఇస్తామని చెప్పలేదని, తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కనుక్కునేందుకే సమావేశాన్ని ఏర్పాటు చేశామని సెక్రెడ్ స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. యథావిధిగా పాఠశాల కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కొంతమంది పాఠశాల సిబ్బంది అవగాహనాలోపమే తల్లిదండ్రులలో ఆందోళనకు దారితీసిందని విద్యాశాఖ అధికారులు వివరణ ఇచ్చారు.

నిన్న సెక్రెడ్ స్కూల్‎ను విలీనం చేస్తారని వార్తలు వచ్చాయి. పాఠశాల సిబ్బంది టీసీలు తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారని తెలిసింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. దీనిపై టీవీ9 వరుస కథనాలతో దిగొచ్చారు అధికారులు. పాఠశాలను యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించారు ఫాదర్ రత్నాకర్. అయితే దీనిపై విద్యా శాఖ మంగళవారం విచారణ జరిపింది. కాగా, విశాఖలో సెక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాలకు ఎంతో పేరుంది. దాదాపు 30 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో జ్ఞానాపురం, కంచరపాలెం, అల్లిపురం, రైల్వే న్యూకాలనీ, కొబ్బరితోట, పూర్ణామార్కెట్ ప్రాంతాలకు చెందిన వందల మంది పేద విద్యార్థినులు చదువుకుంటున్నారు.

Read Also.. Vizag Live Video: విశాఖలో టెన్షన్..టెన్షన్.. ప్రభత్వ పాఠశాల మెసివేతపై విద్యార్థుల ధర్న.. (లైవ్ వీడియో)

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..