ఏపీ కాంగ్రెస్‌లో నయా జోష్.. కీలక పదవిలో మాజీ సీఎం..

ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునర్వైభవాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే ఏపీ పీసీసీకి అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన అధిష్టానం.. తాజాగా ఆఫీస్ బేరర్లను నియమించింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీకి 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులను నియమిస్తున్నట్టు ఏఐసీసీ ఓ ప్రకటన చేసింది. అంతేకాకుండా.. 29 మందితో సమన్వయ కమిటీని కూడా నియుక్తిచేసింది. మరో 12 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీను ఏర్పాటు చేసింది. కాగా, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా పీసీసీ […]

ఏపీ కాంగ్రెస్‌లో నయా జోష్.. కీలక పదవిలో మాజీ సీఎం..
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2020 | 6:09 PM

ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునర్వైభవాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే ఏపీ పీసీసీకి అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన అధిష్టానం.. తాజాగా ఆఫీస్ బేరర్లను నియమించింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీకి 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శులను నియమిస్తున్నట్టు ఏఐసీసీ ఓ ప్రకటన చేసింది. అంతేకాకుండా.. 29 మందితో సమన్వయ కమిటీని కూడా నియుక్తిచేసింది. మరో 12 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీను ఏర్పాటు చేసింది.

కాగా, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్ గా పీసీసీ చీఫ్.. అలాగే సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాందీ వ్యవహరించనున్నారు. అయితే ఈ రెండు కమిటీల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి స్థానం కల్పించనున్నారు. అటు పీసీసీ మాజీ చీఫ్ రఘువీరా రెడ్డికి కూడా ఈ రెండు కమిటీల్లో స్థానం కల్పించారు.