74ఏళ్ల బామ్మకు పండంటి కవలలు.. ప్రపంచ రికార్డు

పిల్లలు కావాలనే బలమైన కోరిక ఆ బామ్మను అమ్మను చేస్తోంది. పెళ్లైన 57ఏళ్ల తరువాత 74ఏళ్ల వయసులో ఆమె కల నెరవేరింది. నవమాసాలు మోసి ఇప్పుడు కవలలకు జన్మనిచ్చింది. ఈ అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. సిజేరియన్ ద్వారా ఈ బామ్మకు కవలలు పుట్టారు. పుట్టిన కవలలిద్దరూ ఆడపిల్లలే. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా ఆమెకు కాన్పు చేశారు డాక్టర్లు. ఈ సందర్భంగా తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు […]

74ఏళ్ల బామ్మకు పండంటి కవలలు.. ప్రపంచ రికార్డు
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 12:10 PM

పిల్లలు కావాలనే బలమైన కోరిక ఆ బామ్మను అమ్మను చేస్తోంది. పెళ్లైన 57ఏళ్ల తరువాత 74ఏళ్ల వయసులో ఆమె కల నెరవేరింది. నవమాసాలు మోసి ఇప్పుడు కవలలకు జన్మనిచ్చింది. ఈ అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. సిజేరియన్ ద్వారా ఈ బామ్మకు కవలలు పుట్టారు. పుట్టిన కవలలిద్దరూ ఆడపిల్లలే. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా ఆమెకు కాన్పు చేశారు డాక్టర్లు. ఈ సందర్భంగా తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా నేలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మకు 1962 మార్చి 22న వివాహం జరిగింది. పెళ్లై ఎన్నాళ్లు అయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచినా వారి ఆశలు నెరవేరలేదు. చివరికి వారి కోరిక ఆశలు నెరవేరకుండానే ఇద్దరు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. అయినప్పటికీ మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలనే కోరిక బలంగా ఉండేది. ఈ క్రమంలో వారికి పొరుగున ఉండే ఓ మహిళ 55ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంతో తల్లి అయ్యారు. దీంతో తాను పిల్లల కోసం ఆ పద్దతిని ఆశ్రయించాలని మంగమ్మ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో డాక్టర్లను కలిసిన ఆమె.. ఈ ఏడాది జనవరిలో ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ పద్దతిలో గర్భం దాల్చారు. ఇక ఇప్పుడు కవలలకు జన్మనిచ్చింది. దీంతో గతంలో 70ఏళ్లకు ప్రసవంతో ఉన్న ప్రపంచ రికార్డును మంగాయమ్మ అధిగమించింది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!