Vizag steel plant : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సంచలన లేఖ.. ఫోన్ స్విచ్ ఆఫ్.. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు..

Vizag Steel Plant Privatization: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి సంచలన లేఖ రాశాడు.

Vizag steel plant : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగి సంచలన లేఖ.. ఫోన్ స్విచ్ ఆఫ్.. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు..
Steel Plant Employee
Follow us

|

Updated on: Mar 20, 2021 | 1:10 PM

Visakha Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి సంచలన లేఖ రాశాడు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 32 మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, తాను 33వ వ్యక్తిగా నిలుస్తానని ప్రకటించాడు. ఆ మేరకు స్టీల్‌ ప్లాంట్ డ్యూటీ లాక్ బుక్‌లో సూసైడ్ నోట్ రాశాడు. అధికారిక సమచారం ప్రకారం.. స్టీల్‌ ప్లాంట్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆత్మాహుతి చేసుకుంటానంటూ స్టీల్ ప్లాంట్ డ్యూటీ లాక్ బుక్‌లో సూసైడ్ నోట్‌ను రాశాడు. అంతేకాదు.. ‘ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరుగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనిని ప్రైవేటు పరం కానివ్వొద్దు. నేను నా ప్రాణాన్ని ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను. నేను స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణ త్యాగం చేసిన 33వ వ్యక్తిగా నిలుస్తాను. ఈ రోజు సాయంత్రం 5.49 నిమిషాలకు స్టీల్ ప్లాంట్‌లోని ఫర్నెస్‌లో ఆహుతి అవుతాను. ఈ పోరాటం నా ప్రాణత్యాగంతో మరింత ఉధృతం కావాలి’ అని టెక్నీషియన్ శ్రీనివాస్ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఇది గ్రహించిన తోటి కార్మికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని సహచర ఉద్యోగులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం రంగంలోకి దిగారు. శ్రీనివాస్ రావు జాడ కోసం గాలిస్తున్నారు.

Employee Suicide Letter

Employee Suicide Letter

ఇదిలాఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖలో ‘కార్మిక మహా గర్జన’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో శ్రీనివాస్ రావు ఆత్మాహుతి లేక తీవ్ర కలకలం సృష్టించింది.

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ లైవ్ కింది వీడియోలో చూడొచ్చు..

Also read:

Telangana MLC Election Results 2021 LIVE: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. 67వ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేట్

India Corona Cases Updates: దేశంలో కరోనా విజృంభణ.. నాలుగు నెలల అనంతరం ఒక్క రోజులోనే భారీగా నమోదైన కేసులు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..