Andhra News: అంతుచిక్కని వ్యాధితో 40లక్షల కోళ్లు మృత్యువాత
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పౌల్ట్రీ రైతులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు చనిపోతూ ఉండటంతో ఏం చేయాలో అర్థంకాక లబోదిబోమంటున్నారు. అప్పటి వరకూ ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు.. గంటల వ్యవధిలోనే చనిపోతున్నట్లు చెబుతున్నారు. కోళ్లలో హెచ్15ఎన్ వైరస్ లక్షణాలు ఉన్నట్లు స్థానిక వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.

ఏపీలో కోళ్ల మృత్యువాత తీవ్ర కలకలం రేపుతోంది. అంతుచిక్కని వ్యాధితో లక్షల కోళ్లు మృత్యువాత పడుతుండడం కలవరపెడుతోంది. ఒకపూట ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు.. మరో పూటకి చనిపోతుండడం పౌల్ట్రీ రైతులకు తీరని నష్టం చేస్తోంది. ప్రధానంగా.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
గత 15 రోజుల్లో సుమారు 40 లక్షల కోళ్ళు చనిపోయాయి. రోజుకు ఒక్కో పౌల్ట్రీలో 10 వేల కోళ్లకు పైగా మృత్యువాతతో కోళ్ల ఫారాలు దగ్గర గుట్టలుగుట్టలుగా పడుతున్నాయి. డిసెంబర్‌లోనే మొదలైన అంతు చిక్కని వైరస్.. సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. దాంతో.. లక్షల్లో కోళ్లు చనిపోయి… పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షల కోళ్ల మృతితో లబోదిబోమంటున్నారు. బాదంపూడిలోని వెంకట మణికంఠ పౌల్ట్రీ ఫారంలోనే లక్షా 60 వేల కోళ్లు మరణించినట్లు రైతులు చెప్తున్నారు.
కోళ్ల మృతిపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు పౌల్ట్రీ యాజమానులు. కోళ్ల వ్యాధులు, మృతిపై నెక్ గానీ, ప్రభుత్వం గానీ ఎలాంటి అవగాహన కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. H5N1 అనే వైరస్ సోకడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు పశు సంవర్ధక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇవే లక్షణాలతో గతంలోనూ లక్షల కోళ్లు మృత్యువాత పడినట్లు తెలిపారు. దాంతో.. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..