Vijayawada: ప్రభుత్వాసుపత్రి దగ్గర హైటెన్షన్‌.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం

Vijayawada: విజయవాడ ప్రభుత్వాసుపత్రి(Government Hospital) దగ్గర టెన్షన్‌ నెలకొంది. సామూహిక అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి.. కేబినెట్‌ ర్యాంక్‌లో ఉన్న మహిళా కమిషషన్‌ ఛైర్మన్‌..

Vijayawada: ప్రభుత్వాసుపత్రి దగ్గర హైటెన్షన్‌.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం
Chandrababu Vs Vasireddi Pa
Surya Kala

| Edited By: Ravi Kiran

Apr 22, 2022 | 7:07 PM

Vijayawada: విజయవాడ ప్రభుత్వాసుపత్రి(Government Hospital) దగ్గర టెన్షన్‌ నెలకొంది. సామూహిక అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి.. కేబినెట్‌ ర్యాంక్‌లో ఉన్న మహిళా కమిషషన్‌ ఛైర్మన్‌ చేరుకున్నారు. ఒకరు విపక్ష నేత.. మరొకరు అధికార పార్టీ నేత. అలాంటిది ఒకే చోట చేరి వాగ్వాదానికి దిగారు. మీరు ఏం చేశారంటే.. మీరు ఏం చేశారంటూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనకు వేదికగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిమారింది. సామూహిక అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు మహిళా చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ(Vasireddy Padma) హాస్పిటల్‌కు వెళ్లారు. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సహా టీడీపీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. వాసిరెడ్డి పద్మను అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగిందని నినాదాలు చేశారు టీడీపీ నాయకులు. ఈ సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు. ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది.

ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. చంద్రబాబు ముందే టీడీపీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరించారని వాపోయారు. టీడీపీ నేతలు తనకు వేలు చూపించి కళ్ళు పెద్దవి చేసి భయపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. బోండా ఉమా అయితే మర్యాద మరచి.. నీకు సిగ్గుందా అంటూ ఇష్టారీతిన ఇష్టానుసారం మాట్లాడారంటూ వాపోయారు. అసలు బాధితురాలిని కలవడానికి టీడీపీ నేతలు వచ్చారా.. లేక రౌడీ రాజకీయం చేయడానికి చంద్రబాబు ఇక్కడికి వచ్చారా…? అంటూ ప్రశ్నించారు. ఇలా టీడీపీ నేతలు వినోద్ జైన్ విషయంలో ఎందుకు స్పందించలేదు. బాధితురాలిని టీడీపీ నేతలు  భయపెట్టారు. చంద్రబాబు కు చిన్న మెదడు చితికందా..? అంటూ సంచలన కామెంట్స్ చేశారు వాసి రెడ్డి పద్మ.. అంతేకాదు.. చంద్రబాబు సహా టీడీపీ నేతలు తనపై దౌర్జన్యం చేశారని.. అందుకనే పోలీసులకు చంద్రబాబు, బోండా ఉమలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు వాసిరెడ్డి పద్మ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Vijayawada: సామూహిక అత్యాచారం ఘటనలో ప్రభుత్వం సీరియస్.. పోలీసులపై సస్పెన్షన్ వేటు

CM Jagan in Ongole: పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ సొమ్ము జమ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్..

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu