Chandrababu Naidu: పూలు వేస్తుండగా రాయి పడి ఉండవచ్చు.!.. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి.. సీపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన నందిగామ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా చేపట్టిన పాదయాత్రలో ఓ వ్యక్తి రాయి విసరడం..

Chandrababu Naidu: పూలు వేస్తుండగా రాయి పడి ఉండవచ్చు.!.. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి.. సీపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Cp Kranti Rana Tata
Follow us

|

Updated on: Nov 05, 2022 | 7:25 AM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన నందిగామ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా చేపట్టిన పాదయాత్రలో ఓ వ్యక్తి రాయి విసరడం కలకలం రేపింది. ఈ దాడిలో ఒకరికి గాయలయ్యాయి. ఈ ఇన్సిడెంట్ పై విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా రెస్పాండ్ అయ్యారు. రాయి తగిలి సీఎస్ఓ కు గాయమైనట్లు వెల్లడించారు. అతనికి ప్రధమ చికిత్స అందించిన తరువాత యధావిధిగా విధులకు హాజరయ్యారని చెప్పారు. 15 కెమెరాల ఫుటేజ్, మీడియా ఫుటేజ్ ల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. జడ్ ప్లస్ కేటగరీ సెక్యూరీటీ ఉండటంతో మొత్తం జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్ని బహుళ అంతస్తుల భవనాలపై సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్న క్రాంతి రాణా.. ఇద్దరు ఐపీఎస్ లతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. జగ్గయ్యపేట నుంచీ మొత్తం భద్రత ఏర్పాటు చేసామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతోందన్న సీపీ.. పూలు వేయడంలో రాయి లేదా అలాంటిది ఏమైనా పడిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు.మరో రెండు రోజుల్లో నిజానిజాలు బయటపెడతామని, ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని సీపీ క్రాంతి రాణా టాటా పేర్కొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోడ్ షో లో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై చంద్రబాబు నాయుడు స్పందించారు. భద్రతా వైఫల్యమే దీనికి కారణమని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదన్న చంద్రబాబు.. సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గర పడ్డాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ హోం మంత్రి చిన రాజప్ప ఖండించారు. టీడీపీ బలపడటాన్ని ఓర్వలేకే దాడులకు దిగుతున్నారని విమర్శించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరగటం పోలీసుల వైఫల్యానికి అద్దం పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. భౌతిక దాడులు సరికాదని, దాడికి పాల్పడిన వారిని తక్షణం గుర్తించి, కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!