Indian Railway: రైలుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన అధికారులు.. పూలతో డెకరేట్‌చేసి, కేక్‌ కట్‌ చేసి..

Indian Railway: మనుషులు పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలు జరుపుకుకోవడం సర్వసాధారణమైన విషయం. అలా కాకుండా రైలుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం ఎప్పుడైనా విన్నారా.? తాజాగా రైల్వే అధికారులు నిజంగానే రైలుకు...

Indian Railway: రైలుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన అధికారులు.. పూలతో డెకరేట్‌చేసి, కేక్‌ కట్‌ చేసి..
Follow us

|

Updated on: Jul 01, 2022 | 8:24 AM

Indian Railway: మనుషులు పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలు జరుపుకుకోవడం సర్వసాధారణమైన విషయం. అలా కాకుండా రైలుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం ఎప్పుడైనా విన్నారా.? తాజాగా రైల్వే అధికారులు నిజంగానే రైలుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ట్రైన్‌ను పూలతో అందంగా అలంకరించి, కేక్‌ కట్‌ చేసి మరీ సెలబ్రేట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. పినాకిని ఎక్స్‌ప్రెస్‌ సేవలు ప్రారంభమై జూలై 1వ తేదీ నాటిని సరిగ్గా 30 ఏళ్లు గడుస్తోంది. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్‌ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు వేడుకలు నిర్వహించారు. అధికారులు, ఉద్యోగులు ఒకచోట చేరి కేక్‌ కట్‌ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్న విజయవాడ డివిజన్‌ రైల్వే వేడుకలకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే పినాకిని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ జంక్షన్‌, ఎమ్‌జీఆర్‌ చెన్నై సెంట్రల్‌ల మధ్య నడుస్తుంది. ఈ రైలును విజయవాడ రైల్వే విభాగం చూసుకుంటుంది.1991లో ఈ రైల్వే సేవలను ప్రారంభించారు. పెన్నా నది పేరు మీదుగా ఈ రైలుకు పినాకిని అని నామకరణం చేశారు. ఈ రైలు విజయవాడ, చెన్నైల మధ్య ప్రతిరోజూ నడుస్తుంది. మొత్తం 431 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటలు పడుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..