మీరు మటన్ తింటున్నారా..? అయితే ఫట్టే..!!

సండే రోజున ముక్క లేనిదే ముద్ద దిగదని మాంసం ప్రియులు చెబుతుంటారు. ఇక పండుగలు, శుభకార్యాలు, విందులకు చెప్పేదేముంది.. నాన్‌ వెజ్‌ మస్ట్‌ అయిపోయింది. మేక, గొర్రె ఖరీదైనా సరే.. కొనేస్తున్నారు. కానీ.. మీరు తింటున్న మటన్‌ మంచిదేనా? షాపుల్లో కొంటున్న మాంసం నాణ్యమైనదేనా? విజయవాడ కబేలాలో పరిస్థితిని చూస్తే విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. సాధారణంగా మాంసాన్ని విక్రయించాలంటే ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్‌ పర్మిషన్‌ కంపల్సరీ. అది తినడానికి పనికొస్తుందో లేదో ఆయనే నిర్ధారించాలి. తర్వాతే విక్రయించాలి. […]

మీరు మటన్ తింటున్నారా..? అయితే ఫట్టే..!!
Follow us

| Edited By:

Updated on: Oct 22, 2019 | 11:49 AM

సండే రోజున ముక్క లేనిదే ముద్ద దిగదని మాంసం ప్రియులు చెబుతుంటారు. ఇక పండుగలు, శుభకార్యాలు, విందులకు చెప్పేదేముంది.. నాన్‌ వెజ్‌ మస్ట్‌ అయిపోయింది. మేక, గొర్రె ఖరీదైనా సరే.. కొనేస్తున్నారు. కానీ.. మీరు తింటున్న మటన్‌ మంచిదేనా? షాపుల్లో కొంటున్న మాంసం నాణ్యమైనదేనా? విజయవాడ కబేలాలో పరిస్థితిని చూస్తే విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి.

సాధారణంగా మాంసాన్ని విక్రయించాలంటే ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్‌ పర్మిషన్‌ కంపల్సరీ. అది తినడానికి పనికొస్తుందో లేదో ఆయనే నిర్ధారించాలి. తర్వాతే విక్రయించాలి. కానీ.. విజయవాడ కబేలాలో మాత్రం అలా జరగడం లేదు. ఇక్కడ మీట్‌ స్టాంపింగ్‌ దందా జరుగుతోంది. ఓ మేకను గానీ.. గొర్రెను గానీ.. స్లాటర్‌ చేయాలంటే రూల్స్‌ ప్రకారం 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో పెట్టాలి. అవి ఆరోగ్యంగా ఉన్నాయని తేలిన తర్వాతే స్లాటర్‌ చెయ్యాలి.

ప్రతి కబేలా సెంటర్‌లో పశువైద్య అధికారి పరిశీలించాకే మున్సిపల్‌ అధికారులు స్టాంప్‌ చెయ్యాలి. అయితే.. విజయవాడలో మాత్రం పరిస్థితి రివర్స్‌గా ఉంది. అధికారుల నిర్లక్ష్యం.. కాసుల కక్కుర్తితో ఇక్కడ స్టాంపింగ్‌ యథేచ్ఛగా సాగుతోంది. అపరిశుభ్ర ఏరియాలో ఇష్టం వచ్చినట్లు స్లాటర్‌ చేస్తున్నారు. దీనివల్ల రోగాలు ప్రబలే అవకాశం ఉంది. మేక, గొర్రె అనారోగ్యంగా ఉన్నా కూడా షాపులకు తరలించేస్తున్నారు. ఇక షాపుల్లో పరిస్థితి చెప్పేదేముంది. రోడ్ల పక్కనే ఉంటాయి.. ఆరుబయటే మాంసం వేలాడుతూ ఉంటుంది. వాహనాల దుమ్ము, దూళి అంతా మాంసంపై పడుతూ ఉంటుంది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?