Andhra News: అలా ఎలా నమ్ముతార్రా.. లక్షల్లో లాభాలన్నారు.. కట్‌చేస్తే కోట్లు కాజేశారు.. ఎలానో తెలిస్తే..

ఈజీ మనీకోసం అలవాటు పడిన కేటుగాళ్లు రోజుకో కొత్తరకం మోసంతో జనాల జేబులకు చిల్లులు పెడుతున్నారు. డబ్బులకు ఆశపడి జనాలు కూడా వాళ్లను గుడ్డిగా నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే విజయవాడలో వెలుగు చూసింది. అధిక వడ్డీలు ఆశ చూపి జనాల నుంచి కోట్లు కొల్లగొట్టారు కేటుగాళ్లు.విషయం పోలీసుల దృష్టికి చేరడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేటకు కేసును ఛేదించారు.

Andhra News: అలా ఎలా నమ్ముతార్రా.. లక్షల్లో లాభాలన్నారు.. కట్‌చేస్తే కోట్లు కాజేశారు.. ఎలానో తెలిస్తే..
Vijayawada Money Scam

Edited By: Anand T

Updated on: Aug 16, 2025 | 10:54 PM

హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ చేస్తామని నకిలీ ఎంవోయూలు చూపించి కోట్లు కొల్లగొట్టిన కేసును బెజవాడ పోలీసులు చేధించారు. ఒకటి కాదు రెండు కాదు మొత్తం 596 కోట్ల స్కాంలో కీలక నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అధిక వడ్డీలు ఆశ చూపి లక్షకు లక్ష ఇస్తామని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసారు నిందితులు.ఈ కేసులో కీలక నిందితులు వెంకట సత్య లక్ష్మీ కిరణ్,రాజేంద్ర బాబు,వేణు గోపాలరావు అరెస్టు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బును సీజ్ చేశారు. 344 మంది యూపిక్స్ యానిమేషన్ సంస్థలో పెట్టుబడులు పెట్టగా 183 మంది బాధితులుగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. యూపిక్స్ లో పెట్టుబడులు పెట్టీ అక్రమంగా డబ్బులు తీసుకున్న 136 మంది తక్షణమే డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో గురించి విజయవాడ పోలీసులు వివరాలు వెల్లడించారు. యూపిక్స్‌లో 344 మంది సభ్యులు కలిపి మొత్తం 592 కోట్లు పెట్టుబడులు పెట్టారని.. అందులో 183 మంది 353 కోట్లు ఇన్వెస్ట్ చేసి, కేవలం 159 కోట్లు మాత్రమే తిరిగి తీసుకున్నట్లు గుర్తించారు. 136 మంది 238 కోట్లు పెట్టుబడి పెట్టి 358 కోట్లు వెనక్కి తీసుకుని లబ్ధిపొందినట్లు గుర్తించారు. ఇక 25 మంది 42 కోట్లు పెట్టుబడి పెట్టి, లాభ నష్టాలు లేకుండా అదే మొత్తాన్ని తిరిగి తీసుకున్నారనీ.. ఏజెంట్లు మాత్రం కమిషన్ రూపంలో 6.51 కోట్లు తీసుకున్నట్లు గుర్తించారు.

యూపిక్స్ యానిమేషన్ స్కాం పేరుతో విజయవాడ కేంద్రంగా కార్యాలయం తెరిచి 5,960 కోట్లకు పైగా వసూలు చేసారనీ పోలీసులు గుర్తించారు. 2014 నుంచి యూపిక్స్ సంస్థను నడుపుతున్న సంస్థ ఎండి కిరణ్ ఈజీ మనీకి అలవాటు పడి ఈ దందా చేసినట్లు గుర్తించారు. బాధితులు అంతా ఎక్కువగా గుంటూరు , నరసరావు పేటకు చెందిన వారు కావడంతో .. కేసులో అరెస్టైన నిందితుల ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు న్యాయం చేసేలా ముందుకు వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.