Vaccination In Andhra Pradesh: ఏపీలో వ్యాక్సినేషన్‌ ఎక్కడ జరుగుతుందో తెలుసా.? పూర్తి వివరాలు..

Vaccination In AP: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే తొలి దశ ప్రక్రియ పూర్తయింది...

Vaccination In Andhra Pradesh: ఏపీలో వ్యాక్సినేషన్‌ ఎక్కడ జరుగుతుందో తెలుసా.? పూర్తి వివరాలు..
Follow us

|

Updated on: Mar 04, 2021 | 9:01 PM

Vaccination In AP: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని అంతమొందించే క్రమంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే తొలి దశ ప్రక్రియ పూర్తయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా కొకసాగుతోంది. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ పూర్తయింది. తాజాగా 60 ఏళ్లు నిండినవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్‌ తొలి డోసు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ ప్రక్రియ కోసం ఏపీలో మొత్తం 571 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతోంది. వీటిలో 472 ప్రభుత్వ కేంద్రాలు కాగా.. 99 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీకా పంపిణీ కేంద్రాల వివరాలు కోసం http://dashboard.covid19.ap.gov.in/ims/covidvaccine_centers/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఇవి తప్పనిసరి..

టీకా వేసుకోవాలనుకునే వారు ముందుగా వమ పేరును కోవిన్‌ యాప్‌ లేదా వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అలాగే 45 నుంచి 59 ఏళ్లు వయసున్న వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడితే టీకా కోసం ముందుగా డాక్టర్‌ సంతకం చేసిన డిక్లరేషన్‌ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక టీకా వేసుకోవాలనుకునే వారు ఫొటో, గుర్తింపు కార్డును పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తుండగా.. ప్రైవేటు ఆసుపత్రిలో మాత్రం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. కొవిన్‌ పోర్టల్‌లో ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలో తెలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ వీడియోను రిలీజ్‌ చేసింది.

Also Read: Jobs In AP: ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. పరీక్ష లేకుండానే ఉద్యోగాలు.. ఎక్కడో తెలుసా.?

షర్మిల కొత్త పార్టీపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్‌.. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏమన్నారంటే..

ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. మహిళా దినోత్సవం పురస్కరించుకుని జగన్ కానుక.. మొబైల్‌ ఫోన్‌ కొన్నవారికి.. 10 శాతం రాయితీ