కత్తితో అజ్ఞాత వ్యక్తి వీరంగం..ఆటో డ్రైవర్‌కు గాయాలు

కర్నూలు జిల్లా నంద్యాలలో గుర్తు తెలియని వ్యక్తి వీరంగం సృష్టించాడు. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్‌లో అజ్ఞాత వ్యక్తి కత్తితో హల్‌చల్‌ చేశాడు. ఆటో డ్రైవర్‌ కరీముల్లా అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి వారిపై దాడికి పాల్పడ్డాడు. మచ్చు కత్తితో నిద్రిస్తున్న కరీముల్లాపై దాడి చేశాడు. దుండగుడి చేతిలో కరీముల్లా రెండు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. పట్టుకోవడానికి ప్రయత్నించగా దుండగుడు ఉపయోగించిన కత్తిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. కత్తీ పోట్లతో తీవ్రంగా గాయపడిన కరీముల్లాను స్థానికుల […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 5:53 pm, Fri, 20 September 19
కత్తితో అజ్ఞాత వ్యక్తి వీరంగం..ఆటో డ్రైవర్‌కు గాయాలు
కర్నూలు జిల్లా నంద్యాలలో గుర్తు తెలియని వ్యక్తి వీరంగం సృష్టించాడు. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్‌లో అజ్ఞాత వ్యక్తి కత్తితో హల్‌చల్‌ చేశాడు. ఆటో డ్రైవర్‌ కరీముల్లా అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి వారిపై దాడికి పాల్పడ్డాడు. మచ్చు కత్తితో నిద్రిస్తున్న కరీముల్లాపై దాడి చేశాడు. దుండగుడి చేతిలో కరీముల్లా రెండు చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి. పట్టుకోవడానికి ప్రయత్నించగా దుండగుడు ఉపయోగించిన కత్తిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. కత్తీ పోట్లతో తీవ్రంగా గాయపడిన కరీముల్లాను స్థానికుల సాయంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. భాదితుడి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.