ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. బెజవాడ టూ విశాఖ..

ఏపీ ప్రజలకు కేంద్రం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడల మధ్య త్వరలోనే ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వారంలో 5 రోజులు ఈ రైలు సేవలు అందిస్తుందని.. దీనితో రెండు నగరాల మధ్య రవాణా మరింత మెరుగుపడుతుందని ఆయన అన్నారు. గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు విశాఖపట్నం, విజయవాడల మధ్య ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని కోరుతూ […]

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. బెజవాడ టూ విశాఖ..
Ravi Kiran

|

Aug 09, 2019 | 7:35 PM

ఏపీ ప్రజలకు కేంద్రం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడల మధ్య త్వరలోనే ఉదయ్ డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. వారంలో 5 రోజులు ఈ రైలు సేవలు అందిస్తుందని.. దీనితో రెండు నగరాల మధ్య రవాణా మరింత మెరుగుపడుతుందని ఆయన అన్నారు.

గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు విశాఖపట్నం, విజయవాడల మధ్య ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని కోరుతూ రైల్వే మంత్రికి లేఖ రాశారు. దీనిపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పందించడం జరిగింది. ఇక ఆ విషయాన్ని గుర్తు చేస్తూ జీవీఎల్‌ గురువారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. కాగా కేంద్ర నిర్ణయం పట్ల విశాఖ, విజయవాడల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu