Andhra Pradesh: నెల్లూరును వణికిస్తున్న మర్డర్స్.. ఆ ఘటన మరకవకముందే మరొకటి.. ఈ సారి ఇద్దరు..

నెల్లూరులో (Nellore) దంపతుల హత్య ఘటనను మరవకముందే మరోసారి హత్యలు జరగడం కలకలం రేపాయి. నెల్లూరు రూరల్ మండల డైకాస్ రోడ్డు సెంటర్ టైలర్స్ కాలనీలో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి చంపేశారు...

Andhra Pradesh: నెల్లూరును వణికిస్తున్న మర్డర్స్.. ఆ ఘటన మరకవకముందే మరొకటి.. ఈ సారి ఇద్దరు..
Murder
Follow us

|

Updated on: Sep 11, 2022 | 5:54 PM

నెల్లూరులో (Nellore) దంపతుల హత్య ఘటనను మరవకముందే మరోసారి హత్యలు జరగడం కలకలం రేపాయి. నెల్లూరు రూరల్ మండల డైకాస్ రోడ్డు సెంటర్ టైలర్స్ కాలనీలో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి చంపేశారు. రమణారెడ్డి, శ్రీకాంత్ అనే వ్యక్తులు మద్యం సేవిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆటోలో వచ్చి కిరాతకంగా కత్తిలో పొడిచాడు. దీంతో ఘటనాస్థలంలోనే వారు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు (Case) నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అప్పటికే మృతి చెందిన రమణారెడ్డి, శ్రీకాంత్​ల మృతదేహాలను నెల్లూరు జీజీహెచ్​కు తరలించారు. హత్య చేసిన వ్యక్తి ఎవరు.. హత్యకు గల కారణాలు ఏమిటి.. అనే విషయాలు తెలియాల్సి ఉంది. హంతకుని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వాటి సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వరసగా జరుగుతున్న హత్యలు పోలీసులకు సవాల్ గా మారాయి.

గతంలో నెల్లూరులోని అశోక్ నగర్ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. దొంగతనం కోసం ఓ ఇంటికి వెళ్లిన దుండగులు డబ్బులు నగలు ఇవ్వాలంటూ మహిళను కర్రతో కొట్టి చంపేశారు. అదే సమయంలో ఇంటికి వస్తున్న యజమానిని అడ్డుకున్నారు. దారుణంగా గొంతు కోసి ఆయన్నూ చంపేశారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. రాత్రి ఘటన జరగగా ఉదయం స్థానికులు గుర్తించారు. బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

కాగా.. వరసగా జరుగుతున్న హత్యలు నగరవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. పోలీసులు, అధికారులు వీటిపై చర్యలు తీసుకుని నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.