భక్తులకు షాక్.. ఇకపై శ్రీవారి లడ్డూ మరింత ప్రియం!

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే శ్రీవారి దర్శనాన్ని సామాన్యులకు సైతం కల్పించాలనే ఉద్దేశంతో పలు సంస్కరణలు చేసిన టీటీడీ.. తాజాగా దేవస్థానం ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే రిజర్వేషన్లు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతేకాకుండా కొండపై ప్లాస్టిక్‌ను కూడా దశలవారీగా నిషేధించడానికి రంగం సిద్ధం చేసింది. తిరుమలలో ఉండే హోటళ్లు, గృహాల్లో వాటర్ బాటిల్స్‌ వాడకాన్ని నిషేదించడమే కాకుండా.. వీటికి ప్రత్యామ్నాయంగా వాటర్ ప్లాంటులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇక ఇప్పుడు రీసెంట్‌గా టీటీడీ […]

భక్తులకు షాక్.. ఇకపై శ్రీవారి లడ్డూ మరింత ప్రియం!
Follow us

|

Updated on: Nov 13, 2019 | 12:30 PM

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే శ్రీవారి దర్శనాన్ని సామాన్యులకు సైతం కల్పించాలనే ఉద్దేశంతో పలు సంస్కరణలు చేసిన టీటీడీ.. తాజాగా దేవస్థానం ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే రిజర్వేషన్లు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతేకాకుండా కొండపై ప్లాస్టిక్‌ను కూడా దశలవారీగా నిషేధించడానికి రంగం సిద్ధం చేసింది. తిరుమలలో ఉండే హోటళ్లు, గృహాల్లో వాటర్ బాటిల్స్‌ వాడకాన్ని నిషేదించడమే కాకుండా.. వీటికి ప్రత్యామ్నాయంగా వాటర్ ప్లాంటులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇక ఇప్పుడు రీసెంట్‌గా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులందరికీ బార్ కోడ్ విధానం ద్వారా లడ్డూలను అందించనున్నట్లు తెలిపింది. అంతేకాక జీఎంఆర్ సంస్థతో కలిసి తిరుమలలోని ఉద్యానవనాలను సైతం అభివృద్ధి చేస్తామని బోర్డు అధికారులు వెల్లడించారు.

తిరుమలలో లడ్డూ దళారులు ఎక్కువైపోయారని.. అందువల్ల లడ్డూ టోకెన్ల దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకే బార్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా నెలరోజుల్లో రెండంచెల స్కానింగ్ విధానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక రెండో స్కానింగ్ పాయింట్ వద్ద స్కాన్ చేసిన సమాచారం మాత్రమే లడ్డూ కౌంటర్ల వద్దకు చేరేలా నూతన విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.

ఇదిలా ఉండగా శ్రీవారి లడ్డూ ధరను కూడా రెట్టింపు చేసే యోచనలో ఉంది టీటీడీ. లడ్డూ క్రయవిక్రయాల్లో ఇప్పటివరకు ఉన్న రాయితీలన్నింటిని రద్దు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇకపై దర్శనం చేసుకున్న భక్తులకు 160-180 గ్రాముల చిన్న లడ్డూ ఉచితంగా ఇచ్చి.. ఆపై ప్రతీ లడ్డూను రూ.50కి విక్రయించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!