ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!

ఆంజనేయుడిని భజరంగ్ భళి, పవన పుత్రుడు, మారుతీ, అంజనీసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో ప్రజలు కొలుస్తున్నారు.

  • Updated On - 12:27 am, Sun, 8 November 20
ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!

Hanuman Birth Place: ఆంజనేయుడిని భజరంగ్ భళి, పవన పుత్రుడు, మారుతీ, అంజనీసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో ప్రజలు కొలుస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరికీ హనుమంతుడి ఎంతో ప్రీతిపాత్రమైన దేవుడు. ఇదిలా ఉంటే అసలు హనుమంతుడు ఎక్కడ జన్మించాడు.? ఆ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది.? ఈ ప్రశ్నలకు చాలా సమాధానాలు దొరుకుతాయి. ఆంజనేయుడి జన్మస్థలంపై అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది మహారాష్ట్రలోని నాసిక్ అంటే.. మరికొందరు హర్యానా.. ఇంకొందరు ఝార్ఖండ్‌లో అని చెబుతున్నారు. ఇక ఇప్పుడు మన తిరుమల గిరుల్లోనే అంజనీపుత్రుడు జన్మించాడని కొత్త చర్చ మొదలైంది.

తిరుగిరుల్లోనే ఆంజనేయుడు జన్మించాడని.. ఆ ప్రాంతాన్ని టీటీడీ నిర్లక్ష్యం చేస్తోందని కొందరు భక్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు తిరుమలలో ప్రసిద్ది పొందిన జాపాలి తీర్ధమే హనుమంతుని జన్మస్థలంగా కొందరు నమ్ముతున్నారు. స్కంధ పురాణంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో హనుమంతుడు అసలు ఎక్కడ జన్మించాడో తెలుసుకోవాలని టీటీడీ ఆదేశించింది. పురాణాలు, ఇతర గ్రంధాలను పరిశోధించాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనితో ఆంజనేయుడి జన్మస్థలం అందరిలోని ఆసక్తి నెలకొంది.

Also Read:

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ

అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..

మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!

భక్తులకు గుడ్ న్యూస్.. అయ్యప్పస్వామి ప్రసాదం డోర్ డెలివరీ..