Ram Mandir Construction: అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం చెక్కును అందించిన టీటీడీ చైర్మన్‌ వైవీ. సుబ్బారెడ్డి

Ram Mandir Construction: అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణానికి టీటీడీ సహకారం అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ సుబ్బారెడ్డిని విశ్వహిందూ పరిషత్‌...

Ram Mandir Construction: అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం చెక్కును అందించిన టీటీడీ చైర్మన్‌ వైవీ. సుబ్బారెడ్డి
Follow us

|

Updated on: Jan 22, 2021 | 8:57 PM

Ram Mandir Construction: అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణానికి టీటీడీ సహకారం అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ సుబ్బారెడ్డిని విశ్వహిందూ పరిషత్‌, అరెస్సెస్ ప్రతినిధులు కోరారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసంలో విశ్వహిందూ పరిషత్‌ అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీమలింద్‌ పరాందేతోపాటు పలువురు చైర్మన్‌ను కలిశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి టీటీడీ తరపున సహాయం అందించే విషయం బోర్డ్‌ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్‌ సుబ్బారెడ్డి వారికి తెలియజేశారు.

రామ మందిర నిర్మాణానికి సుబ్బారెడ్డి తనవంతు సాయంగా రూ.10 లక్షల విరాళం చెక్కును అందించారు. విశ్వహిందూ పరిషత్‌ క్షేత్ర కార్యదర్శి శ్రీకేశవ్‌ హెగ్డే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పివిఎస్‌ నాయుడు, ఆరెస్సెస్‌ ప్రతినిధులు శ్రీనివాసరాజు, శ్రీదుర్గ ప్రసాద్‌ చైర్మన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

కాగా, మందిర నిర్మాణానికి సుమారు రూ.1100 కోట్ల ఖర్చు అవుతాయనే అంచనాను ఇటీవల రామ జన్మభూమి ట్రస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రామ మందిర నిర్మాణాన్ని విరాళాలతో పూర్తి చేస్తామని విశ్వహిందు పరిషత్ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ డిసెంబర్‌ 16నే ప్రకటనలో తెలిపారు. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి విరాళాలు సేకరిస్తున్నారు. విరాళాలు సేకరిస్తూ వారికి రశీదును అందజేస్తున్నారు.

Also Read: పరువు, ప్రతిష్టలా మారిన ఎన్నికల నిర్వహణ, ఏపీ సర్కారుకి సుప్రీంలోనూ షాక్, ఎస్ఈసీ మీటింగ్‌కు అధికారుల గైర్హాజరీపై ఉత్కంఠ