వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ సంచలన నిర్ణయం

కలియుగ వైకుంఠమైన తిరుమలలో సంవత్సరం పొడుగునా భక్తుల రద్దీ కొనసాగుతుంది. మరో పక్క వీఐపీలతో పాటు వారి సిఫార్సు లేఖలపై కూడా దర్శనం కోసం భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వేసవి సెలవులు కూడా మొదలవుతాయి. దీంతో పెద్ద సంఖ్యలో తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం భక్తులు విచ్చేస్తారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖలను స్వీకరించరాదని టీటీడీ నిర్ణయించింది. వేసవి సెలవుల్లో […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:10 pm, Sat, 13 April 19
వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ సంచలన నిర్ణయం

కలియుగ వైకుంఠమైన తిరుమలలో సంవత్సరం పొడుగునా భక్తుల రద్దీ కొనసాగుతుంది. మరో పక్క వీఐపీలతో పాటు వారి సిఫార్సు లేఖలపై కూడా దర్శనం కోసం భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వేసవి సెలవులు కూడా మొదలవుతాయి. దీంతో పెద్ద సంఖ్యలో తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం భక్తులు విచ్చేస్తారు.

ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖలను స్వీకరించరాదని టీటీడీ నిర్ణయించింది. వేసవి సెలవుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చే ఉద్దేశంతో ప్రోటోకాల్ పరిధిలోని వారికి మినహా ఇతరులకు వారాంతాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనం టిక్కెట్లు జారీ చేయరాదని నిర్ణయించారు. ఇందుకోసం సిఫార్సు లేఖలు సైతం స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 16 నుంచి జులై 14 వరకు అమలులో ఉంటాయి.