Visakha Steel Plant: ఆరని స్టీల్ మంటలు.. కుతకుతలాడుతున్న కూల్‌ సిటీ.. మెరుపు సమ్మెకు ప్లాన్ చేస్తున్న కార్మిక సంఘాలు..!

visakha steel plant: ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. స్టీల్‌ మంటలు ఆరడం లేదు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల ప్రొటెస్ట్‌ కంటిన్యూ అవుతోంది. ధర్నాలు.. ఆందోళనలతో కూల్‌ సిటీ కాస్త కుతకుతలాడుతోంది.

Visakha Steel Plant: ఆరని స్టీల్ మంటలు.. కుతకుతలాడుతున్న కూల్‌ సిటీ.. మెరుపు సమ్మెకు ప్లాన్ చేస్తున్న కార్మిక సంఘాలు..!
Visakha Steel Plant
Follow us

|

Updated on: Mar 15, 2021 | 12:55 PM

ఉక్కు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. స్టీల్‌ మంటలు ఆరడం లేదు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల ప్రొటెస్ట్‌ కంటిన్యూ అవుతోంది. ధర్నాలు.. ఆందోళనలతో కూల్‌ సిటీ కాస్త కుతకుతలాడుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం ఎదుట ధర్నాచేపట్టింది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ఐక్యం కావాలని కోరారు కార్మికులు. ప్రైవేటీకరణ కాకుండా ఉద్యమాన్ని కొనసాగించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు ఇచ్చింది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఆదివారం కూడా భారీ నిరసనలు కొనసాగాయి. ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కదంతొక్కారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం జంక్షన్‌ నుంచి పాత గాజువాక వరకు 5కే వాక్‌ను నిర్వహించారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’, ‘సేవ్‌ స్టీల్‌ ప్లాంట్‌’ నినాదాలతో కూర్మన్నపాలెం, గాజువాక ప్రాంతాలు హోరెత్తాయి.

ప్రైవేటీకరణ ముప్పు నుంచి స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు అనుసరించాల్సిన ప్రణాళికను ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఇప్పటికే ఖరారు చేసింది. యాజమాన్యానికి సమ్మె నోటీసులిచ్చిన కమిటీ.. 25వ తేదీ తర్వాత ఎప్పుడైనా మెరుపు సమ్మెకు దిగాలని నిర్ణయించింది. ఈనెల 20న జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఉక్కు కార్మికుల గర్జన పేరిట స్టీల్‌ ప్లాంట్‌ త్రిష్ణా మైదానంలో బహిరంగసభ నిర్వహించాలని, కిసాన్‌మోర్చా ఢిల్లీ నాయకులతో నగరంలో 28న భారీ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి..

Masiero Naked Protests: అవార్డుల పండగ వేడుకలో నిరసన గళం.. బట్టలు విప్పేసిన ఉత్తమ నటి..

Mydukur Mayor: మైదుకూరు జనం ఎవరిని ఓడించారు..? ఎవరి గెలిపించారు..? మరి పీఠం ఎక్కేది ఎవరు..?

Corona Cases India: మళ్లీ కరోనా విజృంభణ.. దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. వణుకుతున్న మహారాష్ట్ర